Suvalakshmi Life After Cinema: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన క్యారెక్టర్ ని ఎంచుకొని ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే సత్యజిత్ రే లాంటి స్టార్ డైరెక్టర్ ఆమెను హీరోయిన్ గా మార్చాడు. ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువే అయినప్పటికీ ప్రేక్షకుల్లో మంచి ఐడెంటిటీని సంపాదించుకుంది. ఆమె ఎవరు అంటే సువలక్ష్మి… కలకత్తాకు చెందిన ఈమె సినిమా ఇండస్ట్రీలో మంచి ఐడెంటిటిని సంపాదించుకుంది. ఒకరోజు కాలేజీలో జరిగిన ఒక ప్రోగ్రాం లో ఆమెను చూసి తనకి సినిమాల్లో అవకాశం అయితే ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి ఆమె కెరియర్ మారిపోయింది. అయితే తన సోదరుడు కార్ ఆక్సిడెంట్ లో చనిపోవడం వల్ల అతని చిరకాల కోరిక మేరకు ఆమె న్యాయవాది అవ్వాలని ఉద్దేశంతో ఎల్ఎల్బి కంప్లీట్ చేసింది. అలాగే సినిమాల్లో కూడా నటించింది 1993 వ సంవత్సరం నుంచి 2001 సంవత్సరం వరకు ఆమె సినిమాలో యాక్టివ్ గా ఉంది…
చూడడానికి చాలా చక్కగా చీరకట్టుతో అందరి చూపుల్ని ఆకట్టుకునే ఆమె కెరియర్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేయకపోవడానికి గల కారణం ఏంటి అంటే ఆమె గ్లామర్ రోల్స్ కి నో చెప్పింది. కేవలం సాంప్రదాయబద్ధమైన క్యారెక్టర్లు మాత్రమే చేస్తానని చెప్పడంతో ఆమెకు ఎక్కువగా అవకాశాలైతే రాలేకపోయాయి…
దాంతో ఆమె ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయి తన చిరకాల మిత్రుడు ఆయన స్వాగతో బెనర్జీ ని పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడింది. అక్కడ తన భర్త బిజినెస్ లను చూసుకుంటూనే న్యాయవాది వృత్తి చేపడుతుంది… ప్రస్తుతం తను హ్యాపీ గా తన లైఫ్ ను లీడ్ చేస్తుండటం విశేషం…
Also Read: హీరో రవితేజ మేనల్లుడి సినిమా ఓటీటీలో… టాప్ రేటింగ్ పొందిన రొమాంటిక్ థ్రిల్లర్! ఎక్కడ చూడొచ్చు?
ఇక ఇండస్ట్రీ లో హీరోయిన్స్ కెరియర్ చాలా తక్కువ రోజుకు ఉంటుందనే విషయం మనకు తెలిసిందే…ఇక ఇప్పుడు కూడా ఇండస్ట్రీ లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్స్ సైతం వాళ్ళకంటు ఒక మంచి గుర్తింపును సంపాదించుకోవడం విశేషం…