spot_img
Homeఎంటర్టైన్మెంట్Narayana On Bigg Boss 6 Telugu: పెళ్లైన వాళ్లకి బిగ్ బాస్‌లో శోభనం గది.....

Narayana On Bigg Boss 6 Telugu: పెళ్లైన వాళ్లకి బిగ్ బాస్‌లో శోభనం గది.. మరి పెళ్లి కాని వాళ్లకీ? నాగార్జునకు నారాయణ కౌంటర్

Narayana On Bigg Boss 6 Telugu: భారతదేశంలో బిగ్ బాస్ షోని సాంప్రదాయ వాదులు మొదటి నుండి వ్యతిరేకిస్తున్నారు. ఆడ, మగా ఒక ఇంటిలో ఉండడం, కెమెరా ముందే ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోవడం కొందరికి నచ్చడం లేదు. భారతీయ సాంప్రదాయానికి విరుద్ధమైన ఈ షో సమాజంపై చెడు ప్రభావం చూపిస్తుందని సీపీఐ నారాయణ లాంటి రాజకీయ నాయకులు కూడా గట్టిగా వాదిస్తున్నారు.

Narayana On Bigg Boss 6 Telugu
Narayana, nagarjuna

ఫలితంగా తెలుగులో కూడా బిగ్ బాస్ షోపై వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. నిజానికి బిగ్ బాస్ సీజన్ 3కి ముందు… షో ఆపేయాలని కొందరు ఆందోళనలు చేశారు. బిగ్ బాస్ సీజన్3 హోస్ట్ నాగార్జున అని తెలుసుకున్న విద్యార్థులు ఆయన ఇంటి ముందు ఆందోళన చేయడం జరిగింది. షోను నిలిపివేయాలని కోర్ట్ లలో పిటీషన్స్ వేయడం కూడా జరిగింది.

ఎవరెన్ని చేసినా బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రస్తు బిగ్ బాస్ సీజన్ 6 కూడా నిన్న గ్రాండ్ గా మొదలు అయ్యింది. ఈ నేపథ్యంలో మళ్లీ రంగంలోకి దిగారు సీపీఐ నారాయణ. ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ బిగ్‌ బాస్ షోపై సీపీఐ నారాయణ ఎలా విరుచుకుపడ్డారో చూద్దాం రండి.

ఇటీవల బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ హౌస్ లోని ఇద్దరు భార్యాభర్తలైన కంటెస్టెంట్లను గట్టిగా హగ్ చేసుకొని ‘నారాయణ నారాయణ వాళ్లిద్దరూ భార్యాభర్తలు’ అంటూ కౌంటర్ ఇచ్చాడు హోస్ట్ నాగార్జున. బిగ్ బాస్ హౌస్ ను బ్రోతల్ హౌస్ అని.. అక్కడికి వెళ్లినవారు రెడ్ లైట్ ఏరియాకు వెళ్లినట్లు అని.. నాగార్జున డబ్బు కోసం గడ్డి తింటున్నాడని ఇటీవల సీపీఐ నారాయణ విమర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై బిగ్ బాస్ ప్రేమికులు, మాజీ కంటెస్టెంట్లు విరుచుకుపడుతున్నారు.

Narayana On Bigg Boss 6 Telugu
Narayana On Bigg Boss 6 Telugu

నాగార్జున బిగ్ బాస్ లో నారాయణకు గట్టి కౌంటర్ ఇచ్చాడు.. ‘నారాయణ.. నారాయణ వాళ్లు మ్యారీడ్’ అంటూ ఎద్దేవా చేశాడు. దీనికి నారాయణ తాజాగా స్పందించారు. ‘నాగన్నా.. నాగన్న..’ అంటూ రివర్స్ కౌంటర్ ఇస్తూ వీడియో వదిలారు. ‘బిగ్ బాస్ హౌస్ లో పెళ్లైన జంటకు లైసెన్స్ ఇచ్చి శోభనం గది ఏర్పాటు చేశారన్నా.. మరి మిగతా వాళ్లకు ఏం చేశారు? వాళ్లకేం పెళ్లిళ్లు కాలేదు కదా? వాళ్లేం బంధువులు కాదు కదా? మరి వాళ్లేం అయ్యారు? వందరోజుల పాటు వాళ్లేం చేస్తారో అది కూడా చెప్పన్నా.. నాగన్నా.. నాగన్నా ఈ బిగ్ బాస్ షోలో’ అంటూ సీపీఐ నారాయణ కౌంటర్ ఇచ్చాడు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Tata Sierra

Tata Sierra: కఠినమైన రోడ్లపై కూడా సాఫీగా సాగేలా.. టాటా కొత్త ప్రయోగం..

Tata Sierra: ప్రస్తుత కాలంలో కారు కొనే ముందు చాలా విషయాలు ఆలోచిస్తున్నారు. కొందరు కేవలం సిటీలో మాత్రమే రన్ అయ్యే కారుపై ఆసక్తి చూపుతుండగా..మరికొందరు మాత్రం లాంగ్ డ్రైవ్ లో గతుకుల...
Banana Benefits

Banana Benefits: అరటిపండు ఈ టైంలో తినొచ్చా..ఎవరు తినకూడదు..

Banana Benefits: మార్కెట్లో విరివిగా లభించే పండ్లలో అరటిపండు ఒకటి. ఇది రుచితో పాటు శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ B6, ఫైబర్ వంటి పోషకాలను అందిస్తుంది. చిన్నారుల నుంచి పెద్దల...
July 26 Zodiac Predictions

July 26 Zodiac Predictions: జూలై 26 నుంచి ఈ ఆరు రాశుల వారికి పండుగే.. ఎలాగంటే

July 26 Zodiac Predictions: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల్లో మార్పుల కారణంగా కొన్ని రాశుల స్థానాలు మారుతూ ఉంటాయి. జూలై 26 నుంచి గురు చంద్రుల మధ్య ఏర్పడనున్న రాశి పరివర్తన...
Japan Heatwave

Japan Heatwave: అధిక ఉష్ణోగ్రతలతో హీటెక్కుతున్న జపాన్.. హ్యుమన్ ఫ్రిడ్జ్ వాడుతున్న జనం.. అసలేంటిది..

Japan Heatwave: సాధారణంగా ఆహ్లదకరమైన వాతావరణాన్ని కలిగి ఉండే జపాన్ ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోవడంతో అక్కడి...
Lenin Success

Lenin Success: లెనిన్ హిట్ తో దర్శకుడి జాతకం మతిపోయింది… స్టార్ హీరోతో మూవీ సెట్ చేసుకున్నాడుగా…

Lenin Success: అఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్... మొదటి సినిమాతోనే బుక్క బోర్లపడ్డాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన కెరియర్ లో ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. ఎట్టకేలకు...
Oktelugu Epaper