Vijay Deverakonda- RGV: గాడ్ ఫాదర్ లేని విజయ్ దేవరకొండను ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారనే వాదన గట్టిగా ఉంది. లైగర్ మూవీ విషయంలో ఇది క్లియర్ గా బయటపడింది. లైగర్ మూవీపై కొందరు పనిగట్టుకుని నెగిటివ్ ప్రచారం చేశారు. సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారంటూ లైగర్ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. విజయ్ ఎదుగుదలను ఓర్వలేక కొందరు హీరోలు ఇది చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఓ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న వర్మ పలు ఆసక్తికర అంశాలపై తన అభిప్రాయాలు తెలిపారు.

విజయ్ దేవరకొండ చూపిన యాటిట్యూడ్ కూడా లైగర్ రిజల్ట్ పై ప్రతికూల ప్రభావం చూపిందన్న వాదన ఉంది. దీని గురించి వర్మ మాట్లాడుతూ… విజయ్ దేవరకొండకు యాటిట్యూడ్ అనేది లైగర్ చిత్రానికి మాత్రమే రాలేదు. అర్జున్ రెడ్డి మూవీకి ముందు నుండే అతడు అలా ఉన్నాడు. టాలీవుడ్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, ప్రభాస్,రామ్ చరణ్ చాలా వినయంగా ఉంటారు. విజయ్ దేవరకొండ మాత్రం అగ్రెసివ్ గా ఉంటాడు. అదే అతన్ని స్టార్ చేసింది. లైగర్ సినిమా విషయంలో బ్యాడ్ లక్ అతన్ని వెంటాడింది. హిందీ ప్రేక్షకులు విజయ్ ని ఓన్ చేసుకోలేకపోయారని వర్మ అన్నాడు.
అలాగే విజయ్ ని పరిశ్రమలో తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం పైన కూడా వర్మ స్పందించారు. ఎదుగుతున్న హీరోని తొక్కేయాలని చూడడం ఇండస్ట్రీలో చాలా సహజం. ఈ సాంప్రదాయం ఎప్పటి నుండో వుంది. ఒక హీరో ఎదుగుదల చూసి ఇతర హీరోలు జలస్ ఫీల్ అవుతారు. అది మానవ లక్షణం. ఇతర హీరోల ఫ్యాన్స్ వీడియోలు చేసి టార్గెట్ చేస్తారు. వాళ్ళ నెగిటివ్ ప్రచారానికి విజయ్ యాటిట్యూడ్ ప్లస్ అయ్యింది. లైగర్ దారుణ ఫలితం చవిచూసిందని వర్మ అభిప్రాయపడ్డారు.

లైగర్ ఫలితం తర్వాత కూడా విజయ్ దేవరకొండ ఏం మారలేదు. అదే యాటిట్యూడ్ మైంటైన్ చేస్తున్నాడు.పరిస్థితులు అతనికి వ్యతిరేకంగా మారడం వలన ఈ వాదనలు తెరపైకి వచ్చాయి. లైగర్ మూవీలో సరైన కంటెంట్ లేకపోవడం వలన డిజాస్టర్ అయ్యింది. దాన్ని ఆసరాగా చేసుకొని యాంటీ ఫ్యాన్స్ యూట్యూబ్ లో వీడియోలు, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారని వర్మ అభిప్రాయపడ్డారు. లైగర్ మూవీలో విషయం ఉంటే ఎంత మంది నెగిటివ్ ప్రచారం చేసినా విజయ్ దేవరకొండకు ఏమీ అయ్యేదని కాదన్న భావన వర్మ వ్యక్తపరిచారు.