Jabardasth Rajamouli: జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంత మంది పాపులర్ కమెడియన్స్ మన టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొంతమంది సినిమాల్లోకి రాలేకపోయిన బుల్లితెర పై వివిధ ఎంటర్టైన్మెంట్ షోస్ తో అలరిస్తున్నారు. మరికొంత ఇతర రంగాల్లో రాణిస్తున్నారు. అలాంటి కమెడియన్స్ లో ఒకరు రాజమౌళి. ఒకప్పుడు చమ్మక్ చంద్ర , రాకెట్ రాఘవ, బులెట్ భాస్కర్ స్కిట్స్ లో ఎక్కువగా కనిపిస్తూ వచ్చిన రాజమౌళి , ఈమధ్య కాలం లో బుల్లితెర పై కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియా లో రెగ్యులర్ గా యాక్టీవ్ గానే ఉంటున్నాడు. ఈమధ్య కాలం లో పలు ఇంటర్వూస్ కూడా ఇచ్చాడు. ఒక ఇంటర్వ్యూ లో ఆయన తన జీవితం గురించి చెప్పుకొచ్చిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఈమధ్య కాలం లో బుల్లితెర పై కనిపించకపోవడానికి గల కారణాన్ని ఈ ఇంటర్వ్యూ లో వివరించాడు. ప్రస్తుతం తాను చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగం వల్లే ఎంటర్టైన్మెంట్ రంగానికి దూరమైనట్టు రీసెంట్ గా జరిగిన ఈ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ఆరోజుల్లో తెలంగాణ ప్రత్యేక ఉద్యమం లో పని చేసిన కళాకారులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించారు. ఆయన వల్లే ఈరోజు నాకు ఈ ప్రభుత్వ ఉద్యోగం లభించింది. కరోనా సమయం లో బుల్లితెర పై అవకాశాలు రాకపోవడం తో ఇల్లు గడవడం కూడా చాలా కష్టమైంది. ఆ సమయం లోనే కేసీఆర్ ప్రకటించిన ఈ పధకాన్ని ఆకర్షితుడినై దరఖాస్తు చేసుకున్నాను. కీసీఆర్ట్ దయ వల్ల ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగమే నన్ను , నా కుటుంబాన్ని కాపాడింది. కేసీఆర్ చేసిన ఈ మేలుకు జీవితాంతం రుణపడి ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఎంత జీతం సంపాదిస్తున్నాడో బయటకు చెప్పలేదు కానీ, నెలకు 1 లక్ష పైగానే ఉంటుందని అమర్చన వేస్తున్నారు నెటిజెన్స్