spot_img
Homeబిజినెస్Mg Motors April Sales: ఏప్రిల్ నెల కార్ల అమ్మాకాల్లో వృద్ధి సాధించిన MG Motoros..

Mg Motors April Sales: ఏప్రిల్ నెల కార్ల అమ్మాకాల్లో వృద్ధి సాధించిన MG Motoros..

Mg Motors April Sales: భారత ఆటోమోబైల్ రంగంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రీమియం వాహన తయారీ సంస్థ MG Motors.చైనాకు చెందిన SAIC Motor యాజమాన్యంలో ఉన్నప్పటికీ కొన్ని సంవత్సరాలుగా JSW గ్రూప్ పెట్టుబడులతో ఇది స్థానిక కంపెనీగా బలపడింది. అత్యాధునిక సాంకేతికత (AI, కనెక్టెడ్ కార్), అద్భుతమైన డిజైన్ మరియు EV (ఎలక్ట్రిక్) విభాగంలో టాటాకు గట్టి పోటీ ఇస్తూ, SUVల తయారీలో తనదైన ముద్ర వేసింది.

ఎంజీ మోటార్‌ ఇండియా ఏప్రిల్ 2026లో మొత్తం విక్రయాల్లో దాదాపు 3.24శాతం పెరుగుదలతో గణనీయమైన వృద్ధిని సాధించినట్లు తెలుస్తోంది. గత సంవత్సరం ఏప్రిల్‌లో 5,829 యూనిట్లను విక్రయించిన ఈ కంపెననీ 2026 ఏప్రిల్‌లో 6,018 యూనిట్ల సేల్స్ చేసింది. మొత్తం విక్రయాల్లో 189 యూనిట్ల పెరుగుదల నమోదు చేసింది. పశ్చిమ ఆసియాలో సంక్షోభం, గ్లోబల్ సప్లై‑చైన్ అంతరాయాలు ఉన్నా కూడా ఈ వృద్ధి సాధ్యమైంది.

ఎంజీ విక్రయాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రధాన శక్తిగా నిలిచాయి. విండ్సర్ ఈవీ కంపెనీకి టాప్ సెల్లర్‌గా కొనసాగింది. మార్చి 2026లో ఈ మోడల్ 4,530 యూనిట్లు అమ్ముడయ్యాయి. హెక్టార్ రేంజ్‌ కన్వెన్షనల్ పెట్రోల్/డీజిల్ మోడల్‌గా స్థిరమైన క్రమంలో నిలిచి 850 యూనిట్లు విక్రయించడం ద్వారా బ్రాండ్ కి సుస్థిరత కల్పించింది.

ఈ కంపెనీకి చెందిన చిన్న సైజ్‌ కారు కామెట్ ఈవీ పెద్ద ప్రభావం చూపిస్తోంది. మార్చి 2026లో ఇది 682 యూనిట్ల విక్రయాలు నమోదు చేసుకుంది. గత ఏడాదితో పోలీస్తే 294 శాతం వృద్ధి నమోదు చేయడం ద్వారా మార్కెట్‌లో క్రేజ్ సంపాదించింది. అదే విధంగా జెడ్ఎస్ ఈవీ (ZS EV) కూడా మార్చిలో 411 యూనిట్లు అమ్మడం ద్వారా స్థిరమైన ప్రదర్శన కనబరిచింది. ఏప్రిల్ లెక్కల్లో కూడా ఈ మోడల్‌లు సంస్థ ఈవీ పోర్ట్‌ఫోలియోను బలపరిచాయని సంస్థ వారు పేర్కొంటున్నారు.

2026 మార్చిలో ఎంజీ మొత్తం 6,528 యూనిట్లను విక్రయించింది. ఏప్రిల్‌లో 6,018 యూనిట్లు మాత్రమే విక్రయించింది. నెలవారీ అమ్మకాలు చూస్తే 7.81 శాతం పతనం నమోదైంది. అయినప్పటికీ గత ఏప్రిల్‌తో పోలిస్తే వృద్ధి ఉన్నా.. నెలవారీ మాత్రం తగ్గుదల కనిపిస్తుంది.

ఏప్రిల్‌ మార్కెట్‌లో ప్రస్తుత అస్థిరత ఉన్నా కూడా ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యతను మరింత పెంచుతూ, విండ్సర్, హెక్టార్, కామెట్ ఈవీ, జెడ్ఎస్ ఈవీ వంటి మోడల్‌లతో భారత మార్కెట్‌లో ఎంజీ మోటార్స్ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ ప్రణాళికలు ముఖ్యంగా మధ్యస్థ, పెద్ద మధ్యస్థ మరియు పట్టణ కస్టమర్‌లను టార్గెట్‌ చేసుకుంటే, ముందు వచ్చే త్రైమాసికాల్లో విక్రయాల్లో మరింత పెరుగుదల సాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Tata Sierra

Tata Sierra: కఠినమైన రోడ్లపై కూడా సాఫీగా సాగేలా.. టాటా కొత్త ప్రయోగం..

Tata Sierra: ప్రస్తుత కాలంలో కారు కొనే ముందు చాలా విషయాలు ఆలోచిస్తున్నారు. కొందరు కేవలం సిటీలో మాత్రమే రన్ అయ్యే కారుపై ఆసక్తి చూపుతుండగా..మరికొందరు మాత్రం లాంగ్ డ్రైవ్ లో గతుకుల...
Banana Benefits

Banana Benefits: అరటిపండు ఈ టైంలో తినొచ్చా..ఎవరు తినకూడదు..

Banana Benefits: మార్కెట్లో విరివిగా లభించే పండ్లలో అరటిపండు ఒకటి. ఇది రుచితో పాటు శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ B6, ఫైబర్ వంటి పోషకాలను అందిస్తుంది. చిన్నారుల నుంచి పెద్దల...
July 26 Zodiac Predictions

July 26 Zodiac Predictions: జూలై 26 నుంచి ఈ ఆరు రాశుల వారికి పండుగే.. ఎలాగంటే

July 26 Zodiac Predictions: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల్లో మార్పుల కారణంగా కొన్ని రాశుల స్థానాలు మారుతూ ఉంటాయి. జూలై 26 నుంచి గురు చంద్రుల మధ్య ఏర్పడనున్న రాశి పరివర్తన...
Japan Heatwave

Japan Heatwave: అధిక ఉష్ణోగ్రతలతో హీటెక్కుతున్న జపాన్.. హ్యుమన్ ఫ్రిడ్జ్ వాడుతున్న జనం.. అసలేంటిది..

Japan Heatwave: సాధారణంగా ఆహ్లదకరమైన వాతావరణాన్ని కలిగి ఉండే జపాన్ ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోవడంతో అక్కడి...
Lenin Success

Lenin Success: లెనిన్ హిట్ తో దర్శకుడి జాతకం మతిపోయింది… స్టార్ హీరోతో మూవీ సెట్ చేసుకున్నాడుగా…

Lenin Success: అఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్... మొదటి సినిమాతోనే బుక్క బోర్లపడ్డాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన కెరియర్ లో ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. ఎట్టకేలకు...
Oktelugu Epaper