Homeఎంటర్టైన్మెంట్నిర్మాతల షరతు.. వెనక్కి తగ్గిన నాని !

నిర్మాతల షరతు.. వెనక్కి తగ్గిన నాని !

నేచురల్ స్టార్ అంటూ తనకు తానే ఒక బిరుదును తలిగించుకున్న నాని, వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మూడు సినిమాలు సెట్ పై ఉన్నాయి. మరి ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజ్ అవుతాయా ? లేదా ? అనే అనమానంలో ఉన్నారు ఆయా సినిమాల మేకర్స్. ప్రస్తుతానికి అయితే, నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే, ఈ సినిమా వచ్చే నెలలోనే రిలీజ్ అవుతుంది. […]

Naniనేచురల్ స్టార్ అంటూ తనకు తానే ఒక బిరుదును తలిగించుకున్న నాని, వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మూడు సినిమాలు సెట్ పై ఉన్నాయి. మరి ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజ్ అవుతాయా ? లేదా ? అనే అనమానంలో ఉన్నారు ఆయా సినిమాల మేకర్స్. ప్రస్తుతానికి అయితే, నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే, ఈ సినిమా వచ్చే నెలలోనే రిలీజ్ అవుతుంది.

ఒకవేళ విడుదల కాకపోతే, ఆగస్ట్ లో రిలీజయ్యే ఛాన్స్ ఉంది. ఇక సెట్స్ పై ఉన్న మరో రెండు సినిమాలు ‘శ్యామ్ సింగ రాయ్’, ‘అంటే సుందరానికి’. ఈ రెండు సినిమాల్లో దసరాకి ఒక సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ‘శ్యామ్ సింగ రాయ్’ షూటింగ్ చివరి దశకు చేరుకొంది కాబట్టి, దసరాకి ఈ సినిమా ఉండొచ్చు.

కాకపోతే చాల పెద్ద సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. అందుకే, ఫామ్ లో ఉన్న నిర్మాతలు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో తేల్చిన అంశం ఏమిటంటే.. మార్కెట్ ఉన్న హీరోలు తమ సినిమాల రిలీజ్ విషయంలో ఒక నియమం పెట్టుకోవాలనేది మెయిన్ పాయింట్. చాలామంది హీరోల చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి.

అందుకే, ప్రతి హీరో రెండు, మూడు నెలల గ్యాప్ లోనే రెండు సినిమాలను రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. దీంతో అంచనాలు ఉన్న సినిమాల మధ్య పోటీ పెరుగుతుంది. అప్పుడు కలెక్షన్స్ తగ్గుతాయి. అందుకే ప్రతి స్టార్ హీరో తన సినిమాల రిలీజ్ కి మినిమమ్ నాలుగు నెలలు గ్యాప్ ఉండేలా చూసుకోవాలని ఒక షరతు పెట్టారు. మరి ఈ లెక్కన ఈ ఏడాది మూడు సినిమాలను రిలీజ్ కి ప్లాన్ చేస్తోన్న నాని, మొత్తానికి వెనక్కి తగ్గి, తన ప్లానింగ్ ను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper