
ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని ఈ ఘటన కలిచివేసిందని సీఎం జగన్ పేర్కొన్నారు. నేడు వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవాంఛనీయ ఘటన మొన్న ప్రకాశం బ్యారేజీ వద్ద రాత్రి పూట జరిగిందన్నారు. ఇది తన మనసును చాలా కలిచి వేసిందని జగన్ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా మీ అన్నాగా, తమ్ముడిగా చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు.