King 100 Teaser: ఈ ఏడాది ఫ్లాప్ హీరోలు ఏ రేంజ్ లో కం బ్యాక్ ఇచ్చారో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్కరు ఇచ్చే కం బ్యాక్ ని చూసి ట్రేడ్ విశ్లేషకులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి అని చెప్పొచ్చు. రీసెంట్ గా మాస్ మహారాజ రవితేజ ‘ఇరుముడి’ చిత్రం బాక్స్ ఆఫీస్ సునామీ ఏ రేంజ్ కొనసాగుతుందో ప్రతీ రోజు చూస్తూనే ఉన్నాం. 100 కోట్ల గ్రాస్ కొడుతుందని అనుకుంటే, ఈ వీకెండ్ తో ఏకంగా 100 కోట్ల షేర్ మార్కుని, 200 కోట్ల గ్రాస్ మార్కుని అందుకోబోతుంది. దాదాపుగా ఫ్లాపుల్లో ఉన్న హీరోలందరూ కం బ్యాక్ ఇచ్చేశారు, ఇక అక్కినేని నాగార్జున మాత్రమే మిగిలాడని విశ్లేషకులు అనుకుంటున్న సమయంలో నేడు నాగార్జున ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా వందవ చిత్రం ‘కింగ్ 100’ టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూ లో చూద్దాం.
ఒక్క మాటలో చెప్పాలంటే టీజర్ ని చూస్తుంటే ఈ సినిమాని అద్భుతమైన క్వాలిటీ తో తెరకెక్కించినట్టుగా అర్థం అవుతోంది. మేకింగ్ విషయం లో నిర్మాతగా అక్కినేని నాగార్జున ఎక్కడా తగ్గలేదని అనిపిస్తోంది. ఇక డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ‘మనుషుల్లో రెండు రకాలు. డబ్బు ఉన్నోళ్లు, డబ్బు లేనోళ్ళు. డబ్బు లేని సమయం లో నన్ను లూజర్ అని అన్నారు. డబ్బు ఉన్నప్పుడు ‘తే కాల్ మీ ది కింగ్’. గుర్తింపు అనేది డబ్బు కంటే గొప్ప విలువైనది. ఆ గుర్తింపు ని నిలబెట్టుకోవడం కోసం నేను పరిగెడుతూనే ఉండాలి’ అంటూ నాగార్జున చెప్పే డైలాగ్స్ ఈ సినిమా థీమ్ ని వివరిస్తోంది. నాగార్జున లుక్స్, దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ టీజర్ లో అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి.
ఇక టీజర్ ని బట్టీ ఈ సినిమా కథ గురించి ఒక అంచనా కి వస్తే, రాజకీయ నాయకులు ఒక 50000 కోట్ల రూపాయిల విలువ గల లాటరీ స్కామ్ చేస్తారు. ఈ స్కామ్ కారణంగా నాగార్జున ఎలాంటి పరిణామాలను ఎదురుకున్నాడు అనేదే స్టోరీ. ఈ చిత్రానికి ‘లాటరీ కింగ్’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. నాగార్జున కి బాగా కలిసొచ్చిన డిసెంబర్ 24 వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. టీజర్ ని చూస్తుంటే గడిచిన పదేళ్లలో ఇంతటి క్వాలిటీ ప్రోడక్ట్ నాగార్జున నుండి రాలేదని అనిపిస్తోంది. మరి ఈ డిసెంబర్ 24 న నాగార్జున కూడా భారీ కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.