Homeఎంటర్టైన్మెంట్The Paradise Latest Teaser: 'వెల్కమ్ టు జడల్ జమానా'.. పూనకాలు రప్పిస్తున్న 'ది ప్యారడైజ్'...

The Paradise Latest Teaser: ‘వెల్కమ్ టు జడల్ జమానా’.. పూనకాలు రప్పిస్తున్న ‘ది ప్యారడైజ్’ లేటెస్ట్ టీజర్..

The Paradise Latest Teaser: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం కోసం కేవలం ఆయన అభిమానులు మాత్రమే కాదు , ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒక మీడియం రేంజ్ హీరో సినిమాకు ఈ రేంజ్ క్రేజ్ గతం లో ఎప్పుడైనా చూశామా ?, నాని రైజ్ కి ఇంతకంటే మరో ఉదాహరణ ఏమి ఉంటుంది చెప్పండి. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి […]

The Paradise Latest Teaser: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం కోసం కేవలం ఆయన అభిమానులు మాత్రమే కాదు , ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒక మీడియం రేంజ్ హీరో సినిమాకు ఈ రేంజ్ క్రేజ్ గతం లో ఎప్పుడైనా చూశామా ?, నాని రైజ్ కి ఇంతకంటే మరో ఉదాహరణ ఏమి ఉంటుంది చెప్పండి. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ సెన్సేషన్ అయ్యింది. ముందుగా గ్లింప్స్ వీడియో ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ‘ఆయా షేర్’ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎక్కడ చూసినా ఈ సాంగ్ మేనియా నే కనిపిస్తోంది. జెన్ జీ ఆడియన్స్ అయితే మెంటలెక్కిపోతున్నారు.

ఇకపోతే నేడు కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన విలన్ టీజర్ ని విడుదల చేశారు. ఈ చిత్రం రాఘవ్ జుయల్ అనే బాలీవుడ్ నటుడు విలన్ గా నటిస్తున్నాడు. ఆయన క్యారెక్టర్ పేరు విక్రమ్ మాలిక్. ‘ఇప్పుడు ఎవరు వస్తున్నారో తెలుసా?, ఖాన్ దాన్ కా డాన్, స్నేహితులకు జాన్, విక్రమ్ మాలిక్ కి స్వాగతం , సుస్వాగతం’ అంటూ తనికెళ్ళ భరణి వాయిస్ ఓవర్ తో రాఘవ్ జుయల్ ని పరిచయం చేయించాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. మెడ మొత్తం నగలతో , స్టైల్ గా నడుచుకుంటూ రాగా, ఆ షాట్ కి అనిరుద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ లో ఉంది అనే చెప్పాలి. ఇక చివర్లో నేచురల్ స్టార్ నాని ‘వెల్కమ్ టు జడల్ జమానా’ అంటూ చెప్పే డైలాగ్ కూడా బాగా పేలింది. ఓవరాల్ గా హాలీవుడ్ తరహా మేకింగ్ స్టైల్ ని చూపించాడు డైరెక్టర్.

ఈ టీజర్ లో ప్రతీ షాట్ లోనూ క్వాలిటీ వేరే లెవెల్ లో ఉంది అనే చెప్పాలి. దీనిని బట్టీ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని , క్వాలిటీ పరంగా ఎక్కడా తగ్గకుండా , ఏ రేంజ్ లో తీస్తున్నాడా అర్థం అవుతోంది. అందుకే సినిమా విడుదలకు బాగా ఆలస్యం అవుతోంది. ఇక ఈరోజు విడుదల చేసిన ఈ టీజర్ ద్వారా అర్థమైన మరో విషయం ఏమిటంటే , ఈ చిత్రం ఆగస్టు 21 న కూడా విడుదల అవ్వడం లేదని. టీజర్ లో ఎక్కడ కూడా సినిమా విడుదల తేదీని ప్రస్తావించలేదు. నాని కూడా త్వరలో అన్నట్టుగానే చెప్పాడు కానీ , విడుదల తేదీ ప్రస్తావ తీసుకొని రాలేదు. కాబట్టి ఈ చిత్రం వాయిదా పడినట్టే అనుకోవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Nani (@nameisnani)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper