spot_img
Homeఎంటర్టైన్మెంట్Megastar Chiranjeevi: మెగా ఫ్యామిలీ 'కపూర్ ఫ్యామిలీ'లా కావాలనుకున్నా - చిరంజీవి

Megastar Chiranjeevi: మెగా ఫ్యామిలీ ‘కపూర్ ఫ్యామిలీ’లా కావాలనుకున్నా – చిరంజీవి

Megastar Chiranjeevi: బాలీవుడ్ లో ‘కపూర్’ ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది. ఐతే, దక్షిణాదిలో తన కుటుంబాన్ని కూడా ‘కపూర్‌’ ఫ్యామిలీ లాగా చూడాలకున్నానని మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ‘ఆచార్య’ ప్రమోషన్స్‌ లో ఫుల్ బిజీగా ఉన్నారు చిరు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల న్యూస్‌ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆచార్య’ తన కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చారు.

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi

అలాగే తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ.. ‘హిందీ సినీ ఇండస్ట్రీలో కపూర్ ఫ్యామిలీకి ఎంతో గొప్ప పేరు ఉంది. హిందీ ఇండస్ట్రీ అంటే కపూర్ ఫ్యామిలీ. కపూర్ ఫ్యామిలీ అంటే హిందీ ఇండస్ట్రీ అని చెప్పుకునేవారు. అలాంటి గొప్ప గౌరవం తెలుగులో మెగా ఫ్యామిలీకి దక్కాలన్నది నా కోరిక. మా ఫ్యామిలీ నుంచి హీరోలుగా వచ్చిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లు హీరోలుగా గొప్పగా రాణిస్తూ ఇండస్ట్రీలో తమకంటూ ఓ స్టేటస్ తెచ్చుకున్నారు.

Also Read: NTR – Rajamouli: ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ లో ఆగిపోయిన సినిమా ఏమిటో తెలుసా?

వాళ్ళ కెరీర్ పట్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను’ అంటూ చిరు చెప్పుకొచ్చారు. అలాగే చిరు ఇంకా మాట్లాడుతూ.. ‘హిందీ పరిశ్రమలో మనం ఎన్నో అనుమానాలు భరించాం. ఢిల్లీ లో హిందీ సినిమా ఇండస్ట్రీకి ఓ గౌరవం ఉంది. హిందీ సినీ పరిశ్రమకు పెద్ద పీట వేసేవారు. కానీ.. తెలుగు సినిమాలను తెలుగు హీరోలను పెద్దగా పట్టించుకునే వారు కాదు. అప్పుడు నాకు చాలా అవమానంగా అనిపించేది.

ఐతే ఇప్పుడు బాహుబలి, ట్రిపుల్ ఆర్, పుష్ప, రాధే శ్యామ్ వంటి తెలుగు సినిమాలతో మన క్రేజ్ ఇండియా వైడ్ గా విస్తరించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. తెలుగుకి ప్రతి భాషలో గొప్ప గౌవరం దక్కింది. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ నే చెప్పుకునేవారు. కానీ.. సినిమా అంటే తెలుగు సినిమా అంటున్నారు. ముఖ్యంగా బాహుబలి తర్వాత తెలుగు చిత్రసీమకు గొప్ప గౌరవం దక్కింది.

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi

నేను ఎక్కడికి వెళ్లినా పదే పదే టాలీవుడ్ ని పొగుడుతున్నారు’ అంటూ చిరు క్రేజీ కామెంట్స్ చేశారు. ఇక ఆచార్య పై ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నిరంజన్‌ రెడ్డి, రామ్‌ చరణ్‌ కలిసి ఈ భారీ సినిమాని నిర్మిస్తున్నారు. చిరు – చరణ్ మ‌ధ్య ఉండే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు ఫుల్ ఎంట‌ర్‌టైన్ మెంట్ అందిస్తాయట. ఈ చిత్రం ర‌న్ టైం 2 గంట‌ల 58 నిమిషాలు ఉండనుంది.

Also Read:Air Conditioner Side Effects: ఏసీ వినియోగిస్తున్నారా? అయితే జాగ్రత్తలు పాటించాల్సిందే?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

TANA : ఛార్లెట్‌లో తానా సేవా స్పూర్తి.. 21 యూనిట్ల రక్తదానంతో 63 మందికి ప్రాణాధారం!

TANA : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ'...
Meher Ramesh Family Tragedy

Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరిన పవన్...

Meher Ramesh Family Tragedy: రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కూతురు వివాహాన్ని ఎంత గ్రాండ్ గా జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి...
Kiran Abbavaram

Kiran Abbavaram: సంబరాల ఏటి గట్టు మూవీ కిరణ్ అబ్బవరం చేయాల్సిందా…ఎలా మిస్సయ్యింది…

Kiran Abbavaram: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మీడియం...
Balakrishna Injury

Balakrishna Injury: బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లు సంచలన ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్..

Balakrishna Injury: కాకినాడ లో గత కొద్దిరోజుల నుండి NBK111 విరామం లేకుండా షూటింగ్ జరుగుతుండగా, నిన్న ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలయ్య మోకాలికి గాయమైన...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు ఆ రొమాంటిక్ సీన్ చేసేటప్పుడు బాగా ఇబ్బంది పడ్డాడట…

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు తను చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉండే...
Oktelugu Epaper