Mouni Roy divorce news: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఇప్పుడు ఎక్కడ చూసినా పెళ్లిళ్లు వరుసగా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయం లో ఇప్పుడు యంగ్ జంట విడాకులు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆ జంట మరెవరో కాదు , మౌనీ రాయ్ – సూరజ్ నంబియార్. మౌని రాయ్ అనే పేరు మన తెలుగు ఆడియన్స్ లో అందరికీ తెలియకపోయి ఉండొచ్చు కానీ, యూత్ ఆడియన్స్ కి మాత్రం బాగా తెలుసు. ఈమె నాగిని అనే చిత్రం ద్వారా బుల్లితెర ఆడియన్స్ కి పరిచయమైంది. ఈ సీరియల్ హిందీ లోనే కాదు, తెలుగు లో కూడా పెద్ద హిట్. అలా సీరియల్ ద్వారా వచ్చిన ఫేమ్ తో సోషల్ మీడియా లో కూడా మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. యూత్ ఆడియన్స్ ఈమె పేరు చెప్తే పిచ్చెక్కిపోతుంటారు.
తన అందచందాలతో అలాంటి క్రేజ్ ని సంపాదించుకుంది ఈ యంగ్ బ్యూటీ. అంతే కాకుండా ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమాలో విలన్ గా నటించి , పాన్ ఇండియా లెవెల్ లో మూవీ లవర్స్ కి ఇంకా బాగా దగ్గరైంది. అయితే ఈమె తన భర్త సూరజ్ నంబియార్ తో గత కొంతకాలంగా దూరంగా ఉందని, వీళ్లిద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఇలా ప్రచారం జరగడానికి ముఖ్య కారణం ఇన్ స్టాగ్రామ్ లో వీళ్లిద్దరు ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకోవడమే. ఒకప్పుడు మౌని రాయ్ ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టీవ్ గా ఉండేది. ముఖ్యంగా తన భర్త సూరజ్ తో కలిసి దిగిన ఫోటోలు , వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉండేది. కానీ ఈమధ్య కాలం లో అలాంటిది జరగడం లేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూరజ్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పెళ్లి ఫోటోలను కూడా తొలగించాడు.
ఇవన్నీ చూసిన తర్వాత వీళ్లిద్దరు కచ్చితంగా విడిపోయారు అని అంటున్నారు నెటిజెన్స్. గతం లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు కూడా సరిగ్గా ఇదే చేసేవారు. అయితే సోషల్ మీడియా లో ఇంతలా ప్రచారం అవుతున్నప్పటికీ వీళ్లిద్దరు ఈ విడాకుల వార్తలపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. దీని అర్థం , ఈ ప్రచారాలు అన్నీ నిజమే కదా అని నిరూపించినట్టు అవుతోంది. మరోపక్క మౌని రాయ్ కెరీర్ పరంగా ఫుల్ ఫోకస్ తో దూసుకుపోతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘విశ్వంభర’ చిత్రం లో ఈమె ఐటెం సాంగ్ చేసింది. మరోపక్క బాలీవుడ్ మూవీస్ లో వరుసగా విలన్ రోల్స్ , క్యారక్టర్ రోల్స్ తో ఫుల్ బిజీ గా గడుపుతోంది.