Homeఎంటర్టైన్మెంట్Prashna Ravan Jail: జైలులో వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన 'ప్రశ్న రావణ్'.. అసలు ఏమి జరుగుతోంది!

Prashna Ravan Jail: జైలులో వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన ‘ప్రశ్న రావణ్’.. అసలు ఏమి జరుగుతోంది!

Prashna Ravan Jail: గత కొన్నిరోజులుగా సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ప్రముఖ యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’ గురించే చర్చ. ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రతీ రోజు ఇతని పై స్పెషల్ డిబేట్స్ ని నిర్వహిస్తున్నారు. సమాజం లో విద్వేషాలు రెచ్చగొట్టేలా హిందూ దేవుళ్లపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం , టెర్రరిస్టులు , నక్సలైట్లకు సపోర్టుగా వీడియోలు చేయడం, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అత్యంత నీచమైన పదజాలంతో బూతులు తిడుతూ రెచ్చిపోవడం వంటి […]

Prashna Ravan Jail: గత కొన్నిరోజులుగా సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ప్రముఖ యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’ గురించే చర్చ. ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రతీ రోజు ఇతని పై స్పెషల్ డిబేట్స్ ని నిర్వహిస్తున్నారు. సమాజం లో విద్వేషాలు రెచ్చగొట్టేలా హిందూ దేవుళ్లపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం , టెర్రరిస్టులు , నక్సలైట్లకు సపోర్టుగా వీడియోలు చేయడం, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అత్యంత నీచమైన పదజాలంతో బూతులు తిడుతూ రెచ్చిపోవడం వంటి వాటిపై UAPA చట్టం క్రింద ఇతనిపై కేసులు నమోదు చేశారు. కోర్టు ఇతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలు లో ఉన్నటువంటి రావణ్ కి , అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురు అవుతున్నాయి?, పోలీసులు అతన్ని ఏమైనా టార్చర్ చేస్తున్నారా? వంటి విషయాల గురించి పూర్తి సమాచారం తో ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం.

‘ప్రశ్న రావణ్’ కి నెల్లూరు జైలులో ఎలాంటి VIP ట్రీట్మెంట్ లేదు. సాధారణ రిమాండ్ ఖైదీలకు ఏ సెల్ ని అయితే కేటాయించారో , రావణ్ కి కూడా అదే సెల్ ని కేటాయించారట. ఇప్పటి వరకు అయితే రావణ్ ని పోలీసులు ఎలాంటి టార్చర్ కి గురి చెయ్యలేదు, ఆయన శరీరం పై ఒక్క పోలీస్ దెబ్బ కూడా పడలేదు. ఎందుకంటే రిమాండ్ లో ఉన్న ఖైదీలపై పోలీసులు చెయ్యి చేసుకోరాదు కాబట్టి. ఇదంతా పక్కన పెడితే రెండు రోజుల క్రితం ప్రశ్న రావణ్ తన తోటి ఖైదీలతో తన బాధలు చెప్పుకొని బోరుమని విలపించాడట. నా భవిష్యత్తు ఏంటో అర్థం కావడం లేదు , అనవసరం గా ఈ ఊబిలో చిక్కుకున్నాను. నన్ను ఏమి చేయబోతున్నారో అసలు తెలియట్లేదు అంటూ చిన్న పిల్లవాడి లాగా బోరున ఏడ్చాడట రావణ్. కానీ నిన్న , మొన్న కాస్త ధైర్యం గానే ఉన్నాడట.

ఇతన్ని ఒక ప్రముఖ లాయర్ మొన్న కలిశారట. ఆ లాయర్ జడ శ్రవణ్ కాదు ప్రస్తుతం రావణ్ కేసు ని టేకప్ చేసిన పొన్నవోలు సుధాకర్ కూడా కాదట. సుధాకర్ టీం కి సంబంధించిన ఒక లాయర్ ములాఖత్ అయ్యారట. అప్పటి నుండి రావణ్ కాస్త ధైర్యం గా ఉంటున్నాడని సమాచారం. ఉదయం లేచి న్యూస్ పేపర్ చదువుతున్నాడట , టిఫిన్, లంచ్ , డిన్నర్ వంటివి కూడా చేస్తున్నాడట. తోటి ఖైదీలతో మాట్లాడుతున్నాడట , అదే సమయం లో ఆయన ఒంటరిగా ఏకాంతంగా కూడా గడుపుతున్నాడట. రేపు హై కోర్టు లో రావణ్ కస్టడీ పిటీషన్ కి సంబంధించిన విచారణ జరగనుంది. ఈ పిటీషన్ పై ఎలాంటి తీర్పు రాబోతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper