Homeబిజినెస్Maruti Suzuki Alto K10: ధర రూ.3.70 లక్షలు.. మైలేజ్ 33.40 కిలోమీటర్లు.. ఈ కారు...

Maruti Suzuki Alto K10: ధర రూ.3.70 లక్షలు.. మైలేజ్ 33.40 కిలోమీటర్లు.. ఈ కారు గురించి తెలిస్తే క్యూ కడుతారు..

Maruti Suzuki Alto K10: దేశీయ కార్ల మార్కెట్లో తక్కువ ధర, అధిక మైలేజ్ కావాలని కోరుకునే వారికి Maruti Suzuki ఎప్పటికప్పుడు కొత్త కార్లను అందిస్తూ ఉంటుంది. అయితే దశాబ్దాల కిందట మార్కెట్లోకి వచ్చిన ఈ కారు ధర ఇంకా తక్కువగానే ఉంటూ.. మంచి మైలేజ్ ను అందిస్తోంది. అలాగే మొదటిసారి కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ హ్యాచ్‌బ్యాక్ ఇప్పటికీ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. ముఖ్యంగా పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో మైలేజ్‌కు ప్రాధాన్యత ఇచ్చే వినియోగదారులు ఈ కారు వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ కారు గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

మారుతి సుజుకి నుంచి ఆల్టో K10 దశాబ్దాల కిందట ఎవర్ గ్రీన్ గా నిలుస్తోంది. ఈ కారు ధర ప్రస్తుతం రూ.3.70 లక్షల (ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. టాప్ వేరియంట్ ధర రూ.5.45 లక్షల (ఎక్స్‌షోరూమ్) వరకు ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన కారు కోసం చూస్తున్న వారికి ఇది అత్యంత సరసమైన ఎంపికగా చెప్పొచ్చు.

ఆల్టో K10 ధర తక్కువగా ఉన్నప్పటికీ దాని ఇంధన సామర్థ్యం గరిష్టంగా ఉంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం పెట్రోల్ వేరియంట్ లీటరుకు గరిష్టంగా 24.90 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. ఇక CNG వేరియంట్ ఒక కిలో గ్యాస్‌కు 33.40 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. రోజువారీ వినియోగానికి ఇది ఇంధన ఖర్చును గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతుంది.

2026 జూన్ నెలలో ఆల్టో K10 10,388 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. 2025 జూన్‌లో అమ్ముడైన 5,045 యూనిట్లతో పోలిస్తే దాదాపు 106 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం. ఈ గణాంకాలు ఇప్పటికీ ఈ కారుపై వినియోగదారుల్లో ఉన్న విశ్వాసాన్ని, డిమాండ్‌ను ప్రతిబింబిస్తున్నాయి. తక్కువ ధర, అధిక మైలేజ్, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటం, విడిభాగాలు సులభంగా లభించడం, దేశవ్యాప్తంగా విస్తరించిన మారుతి సుజుకి సర్వీస్ నెట్‌వర్క్ వంటి అంశాలు ఆల్టో K10 విజయానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. నగర ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ కారు మంచి ఆదరణ పొందుతోంది.

ఆల్టో K10లో 1.0 లీటర్ K-Series పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది. ఇది మాన్యువల్‌తో పాటు ఆటోమేటిక్ (AMT) గేర్‌బాక్స్ ఆప్షన్‌లో కూడా లభిస్తుంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (ఎంపిక చేసిన వేరియంట్లలో), పవర్ స్టీరింగ్, పవర్ విండోలు, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ABSతో EBD, రియర్ పార్కింగ్ సెన్సర్లు వంటి భద్రతా, సౌకర్యవంతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

మొదటిసారి కారు కొనుగోలు చేసేవారు, రోజువారీ ఆఫీస్ ప్రయాణాలకు కారు ఉపయోగించే వారు, తక్కువ నిర్వహణ ఖర్చుతో అధిక మైలేజ్ కోరుకునే కుటుంబాలకు Maruti Suzuki Alto K10 మంచి ఎంపికగా నిలుస్తోంది. సరసమైన ధర, విశ్వసనీయ పనితీరు, ఇంధన పొదుపు వంటి అంశాలతో భారత మార్కెట్లో ఆల్టో K10 తన ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular