Homeఎంటర్టైన్మెంట్The Paradise: నాని ప్యారడైజ్ ను చుట్టేస్తున్నారుగా... ఇలా అయితే కష్టమే...

The Paradise: నాని ప్యారడైజ్ ను చుట్టేస్తున్నారుగా… ఇలా అయితే కష్టమే…

The Paradise: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన ‘దసరా’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా సక్సెస్ తో మరోసారి వీళ్ళిద్దరి కాంబినేషన్ ని కలుపుతూ ‘ప్యారడైజ్ ‘ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా సరే నాని మరోసారి తను మాస్ హీరోగా ఎలివేట్ అవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాని మార్చి 26వ తేదీన రిలీజ్ చేస్తామంటూ మొదట అనౌన్స్ చేశారు. కానీ […]

The Paradise: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన ‘దసరా’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా సక్సెస్ తో మరోసారి వీళ్ళిద్దరి కాంబినేషన్ ని కలుపుతూ ‘ప్యారడైజ్ ‘ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా సరే నాని మరోసారి తను మాస్ హీరోగా ఎలివేట్ అవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాని మార్చి 26వ తేదీన రిలీజ్ చేస్తామంటూ మొదట అనౌన్స్ చేశారు. కానీ అనుకున్న సమయానికి సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఆగస్టు 21వ తేదీన ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు అంటూ అనౌన్స్ చేశారు.

కానీ ప్రస్తుతం ఈ సినిమా అనుకున్న డేట్ కి రావడం లేదు. ఈ సినిమా మరో 30 రోజుల పాటు షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో శరవేగంగా సినిమా షూటింగ్ అయితే పూర్తి చేస్తున్నారు. బడ్జెట్ మొత్తం పూర్తయిపోయింది. దాంతో ఈ సినిమా చాలా ఫాస్ట్ గా తీసేయమని ప్రొడ్యూసర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి.

ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాని తెరకెక్కించాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం సినిమాకి చాలావరకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. తను అనుకున్నట్టుగానే దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడా? లేదంటే లేట్ అయిపోతుంది. బడ్జెట్ పెరిగిపోతుందనే ఉద్దేశ్యంతో సినిమాను చుట్టేస్తున్నాడా అనే ధోరణిలో కూడా కొంతమంది విమర్శకులు ఈ సినిమా మీద కొన్ని కామెంట్లు చేస్తున్నారు.

మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న శ్రీకాంత్ ఓదెల రెండోవ సినిమాతో ఎలా మెప్పిస్తాడు ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాడా? లేదా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే నాని పాన్ ఇండియాలో స్టార్ హీరోగా వెలుగొందుతాడు. లేకపోతే మాత్రం చాలా వరకు డీలాపడిపోయే ప్రమాదమైతే ఉంది… చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper