Homeఎంటర్టైన్మెంట్Lenin Box Office Collection: 3 రోజుల్లోనే 'లెనిన్' బ్రేక్ ఈవెన్.. వరల్డ్ వైడ్ గా...

Lenin Box Office Collection: 3 రోజుల్లోనే ‘లెనిన్’ బ్రేక్ ఈవెన్.. వరల్డ్ వైడ్ గా వచ్చిన గ్రాస్ ఎంతంటే!

Lenin Box Office Collection: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘లెనిన్’ బాక్స్ ఆఫీస్ వద్ద రాబడుతున్న వసూళ్లను చూసి ట్రేడ్ విశ్లేషకులు నోరెళ్లబెడుతున్నారు. నిన్న ఆదివారం రోజున ఈ చిత్రానికి నమోదైన వసూళ్లు , మొదటి రోజు కంటే ఎక్కువ ఉండడం గమనార్హం. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం మొదటి రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 5 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే , […]

Lenin Box Office Collection: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘లెనిన్’ బాక్స్ ఆఫీస్ వద్ద రాబడుతున్న వసూళ్లను చూసి ట్రేడ్ విశ్లేషకులు నోరెళ్లబెడుతున్నారు. నిన్న ఆదివారం రోజున ఈ చిత్రానికి నమోదైన వసూళ్లు , మొదటి రోజు కంటే ఎక్కువ ఉండడం గమనార్హం. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం మొదటి రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 5 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే , 3 వ రోజున 6 కోట్ల 62 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 7 కోట్ల 82 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 14 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 39 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 22 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ప్రాంతాల వారీగా మొదటి మూడు రోజుల్లో వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ ప్రాంతం నుండి 2 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 2 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఈస్ట్ గోదావరి నుండి 1 కోటి 65 లక్షలు , వెస్ట్ గోదావరి నుండి 1 కోటి 1 లక్ష రూపాయిలు , గుంటూరు నుండి 1 కోటి 54 లక్షల రూపాయిలు , కృష్ణా జిల్లా నుండి 1 కోటి 14 లక్షల రూపాయిలు, నెల్లూరు నుండి 70 లక్షల రూపాయిలు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 17 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి ఈ చిత్రానికి 3 రోజుల్లో 1 కోటి 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా , ఓవర్సీస్ నుండి 2 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 22 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ఈ చిత్రానికి 22 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. విడుదల తర్వాత మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని సాధించింది. నేటి నుండి ఈ చిత్రానికి వచ్చే ప్రతీ పైసా లాభమే. ఫుల్ రన్ లో ఎంత లాభం వస్తుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper