Mogalirekulu Actor: బుల్లి తెరలో సంచలనం సృష్టించిన సీరియల్స్ లో ఒకటి ‘మొగలి రేకులు’ .. జెమినీ టీవీ లో ప్రసారమయిన ఈ సీరియల్ ని మంజుల నాయుడు దర్శకత్వం వహించారు. వందల కొద్దీ ఎపిసోడ్స్ తో ఉర్రుతలూగించింది ఈ సీరియల్. ఈ సీరియల్ తో పాటు దానిలో నటించిన ప్రతి నటి నటులు కూడా అంతే ఫెమస్ అయ్యారు. అయితే ఈ సీరియల్ లో దయా పాత్రలో నటించిన పవిత్రా నాథ్ కూడా అంతే సుపరిచితుడు. నెమ్మది నెమ్మదిగా ఈ నటుడి యొక్క రాసలీలలు మీడియా బయట పడ్డాయి.

అయితే తాజాగా ఈ నటుడి భాగోతాన్ని ఆయన సతీమణి శశిరేఖ మీడియా ముందు బయటపెట్టారు. ఆ సీరియల్ లో దయ పాత్ర పోషించిన పవిత్రనాథ్ రియల్ లైఫ్ లో మాత్రం చాలా నీచుడని ఆయన భార్య శశిరేఖ వెల్లడించారు. నీచమైన పనులని చేస్తూ తన జీవితాన్ని నాశనం వాపోయింది. తన భర్తకి ఎందరో మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, అంతేకాకుండా అమ్మాయిల పిచ్చి ఉందని.. మొగలి రేకులు నటుడి దయా బాగోతాన్ని బట్టబయలు చేసింది ఆయన సతీమణి శశిరేఖ.
పవిత్రానాథ్ బాగోతాన్ని ఆయన సతీమణి శశిరేఖ వివరిస్తూ… జాతకాల పేరుతో అమ్మాయిలకి ఎర వేసి బెడ్ రూమ్ లోకి పిలిచేవాడని, తను పక్కన ఉండగానే రాసలీలలు నడిపేవాడని చెప్పింది. ఒక అమ్మాయితో 8 ఏళ్ల పాటు సహజీవనాన్ని కొనసాగించిన వదిలేసిన సంగతి అత్తమామల కి చెప్తే పట్టి పట్టనట్టు ఉన్నారని తన గోడును వెళ్ళబోసుకుంది. ఈ విషయాలన్నీ చెప్పినందుకు తనని ఇంట్లో నుండి బయటకి గెంటేశారని… ఇదంతా జరిగి పదేళ్లు అవుతోంది అని వాపోయింది.
అప్పటి నుండి మారతాడని ఎదురు చూస్తే కొంచెం కూడా మార్పు రాలేదు అని చెప్పగా.. విడాకులు ఇవ్వమంటే గోడకేసి కొట్టి తల పగలకొట్టాడని చెప్పింది. ఇదంతా జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పవిత్రా నాథ్ భార్య శశిరేఖ. వెంటనే తనకి న్యాయం చేయాలని, తన భర్తను శిక్షించాలని డిమాండ్ చేసింది శశి రేఖ.