Bigg Boss 5 Telugu: నాలుగు సీజన్లు పూర్తి చేసుకుని ఐదు సీజన్లోకి అడుగుపెట్టి ఏడు వారాలు పూర్తి చేసుకోబోతుంది బిగ్ బాస్. నేషన్ లెవెల్ మంచి రేటింగ్ సంపాదించుకుని నెంబర్ వన్ రియాలిటీ షో గా దూసుకుపోతుంది బిగ్ బాస్. ఆరంభం నుండే ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న బిగ్ బాస్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..!

ఎన్నడూ లేని విధంగా మొత్తం 19 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్ లో కి కింగ్ నాగార్జున పంపాడు. గత నాలుగు సీజన్లతో పోలిస్తే ఐదో సీజన్లో కంటెస్టెంట్ల మధ్య ఫైటింగులు బాగానే జరుగుతున్నాయి. మొదటివారంలో జరిగిన నామినేషన్ టాస్క్ మొదలు నిన్నటివరకు జరిగిన కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ వరకు ఏదొక గొడవ జరుగుతూనే ఉంది. దీంతో షో రోజు రోజుకి ఆసక్తికరంగా సాగుతూ మజాను పంచుతుంది. అంతే కాకుండా లవ్ ట్రాకులు, ఎమోషనల్ సన్నివేశాలు,రొమాన్స్ సన్నివేశాలు చూపిస్తూ షోను చాలా ఆసక్తికరంగా నడిపిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ లో చాలా మంది శ్రమించి చేతులు కాళ్ళు విరగకొట్టుకుని మరి టాస్కులు ఆడుతుంటే కొంతమంది మాత్రం బుద్ధితో ఆడుతుంటారు. అలాంటి వారిలో ప్రస్తుతం యూట్యూబ్ సంచలనం షణ్ముఖ్ జస్వంత్ పేరు ముందుగా చెప్పుకోవాలి. ఆరంభం లో గేమ్ చాలా నెమ్మదిగా ఆడిన.. ఇప్పుడు స్ట్రాటజీస్ తో మైండ్ గేమ్ ఆడుతూ తన అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాడు. ఇంకోవైపు సిరి హన్మంతు కూడా చాల దూకుడు గా ఆడుతూ మంచి గట్టి పోటీ ఇస్తుంది. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ మొదటి కెప్టెన్ గా కూడా ఎంపిక అయ్యింది.
అయితే నిన్న జరిగిన కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ లో జెస్సీ, సిరి కి ప్రపోజ్ చెయ్యగా… సిరి మాత్రం షన్ను కి ఐ లవ్ యు అన్ని చెప్పింది. దానికి బదులుగా షన్ను కూడా ఐ లవ్ యు రా అని నోరు జారాడు. మరి బిగ్ బాస్ చూస్తున్న షణ్ముఖ్ ప్రేయసి దీప్తి సునయన మరి ఎలా ఫీల్ అవుతుందో చూడాలి.