Homeఎంటర్టైన్మెంట్Meher Ramesh next movie details: మెహర్ రమేష్ డైరెక్షన్ లో నటించబోతున్న మరో స్టార్...

Meher Ramesh next movie details: మెహర్ రమేష్ డైరెక్షన్ లో నటించబోతున్న మరో స్టార్ హీరో..

Meher Ramesh next movie details: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా పేరు సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మెహర్ రమేష్ లాంటి డైరెక్టర్ మాత్రం ఒక్క సక్సెస్ ను సాధించడానికి నానా తంటాలు పడుతున్నాడు. తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్న కూడా అది వర్కౌట్ కావడం లేదు. కంత్రి సినిమాతో ఓకే అనిపించుకున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ తో చేసిన ‘బిల్లా’ పర్లేదు అనిపిస్తుంది. ఇక […]

Meher Ramesh next movie details: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా పేరు సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మెహర్ రమేష్ లాంటి డైరెక్టర్ మాత్రం ఒక్క సక్సెస్ ను సాధించడానికి నానా తంటాలు పడుతున్నాడు. తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్న కూడా అది వర్కౌట్ కావడం లేదు. కంత్రి సినిమాతో ఓకే అనిపించుకున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ తో చేసిన ‘బిల్లా’ పర్లేదు అనిపిస్తుంది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత చేసిన శక్తి, షాడో, భోళా శంకర్ లాంటి సినిమాలు భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాయి. ఇక మెహర్ రమేష్ లాంటి దర్శకుడు సైతం ఆ తర్వాత పెద్దగా సినిమాలను చేయకుండాపోయాడు. ఇక ఇప్పుడు ఆయన మరోసారి ఇంకో స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే తమిళ్ ఇండస్ట్రీకి చెందిన ధనుష్ గా తెలుస్తుంది. ధనుష్ కి రీసెంట్ గా ఆయన ఒక కథ వినిపించారట. ధనుష్ కి కథ నచ్చడంతో అతనితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా మెహర్ రమేష్ కథలు బాగా చెబుతాడు. కానీ దానిని స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయడంలో మాత్రం ఆయన చాలా వరకు తడబడతాడనే ఒక టాక్ ఉంది. ఇక దానికి చెక్ పెడుతూ ఈ సినిమాతో మెహర్ తనను తాను ప్రూవ్ చేసుకుంటాడా? లేదంటే మరోసారి మరో ఫ్లాప్ ను అందుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే మెహర్ రమేష్ లాంటి ప్లాప్ డైరెక్టర్ తో సినిమాలు చేయడం ఎందుకు అంటూ ధనుష్ అభిమానులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కానీ మెహర్ రమేష్ మాత్రం ఈసారి తన మేకింగ్ తో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఈ విషయాన్ని తెలుసుకున్న మరికొందరు నిజంగానే మెహర్ రమేష్ కి ధనుష్ డేట్స్ ఇచ్చాడా? ఈ సినిమా నిజంగానే పట్టాలెక్కుతుందా? అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే తప్ప సినిమా ఉంటుందా? ఉండదా అనే విషయం మీద సరైన క్లారిటి రాదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper