Homeఎంటర్టైన్మెంట్SARIPODA SANIVARAM : సరిపోదా శనివారం' చిత్రాన్ని వదులుకున్న మెగా హీరో అతనేనా..? బంగారం లాంటి...

SARIPODA SANIVARAM : సరిపోదా శనివారం’ చిత్రాన్ని వదులుకున్న మెగా హీరో అతనేనా..? బంగారం లాంటి ఛాన్స్ మిస్ అయ్యాడుగా!

ఈ సినిమాని ముందుగా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ నాని తో చెయ్యాలని అనుకోలేదట. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో చెయ్యాలని అనుకున్నాడట. సాయి ధరమ్ తేజ్ కి బైక్ యాక్సిడెంట్ జరగకముందు ఈ స్టోరీ ని వినిపించాడు. కానీ కొత్త రకం కాన్సెప్ట్, పైగా వివేక్ ఆత్రేయ గత చిత్రం 'అంటే సుందరానికి' పెద్ద ఫ్లాప్ అయ్యింది, ఇలాంటి సమయంలో రిస్క్ చెయ్యడం ఎందుకు అని, ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు.

SARIPODA SANIVARAM : ప్రస్తుతం టాలీవుడ్ ఆడియన్స్ న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ చిత్రం కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ సంక్షోభంలో పడే పరిస్థితి ఏర్పడింది. ‘కల్కి’ లాంటి భారీ హిట్ తర్వాత, అలాంటి వసూళ్లు ఇచ్చే సినిమా ఒక్కటి కూడా రాలేదు. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ వంటి చిత్రాలు భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఇలాంటి క్లిష్టమైన సమయంలో మహేష్ బాబు పాత చిత్రం ‘మురారి’ రీ రిలీజ్ అయ్యి మంచి వసూళ్లను రాబట్టి థియేటర్స్ మూతపడకుండా చేసింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర చిత్రం గ్రాండ్ గా రీ రిలీజ్ అయ్యి, అద్భుతమైన వసూళ్లను రాబట్టి మరోసారి థియేటర్స్ ని నిలబెట్టాయి.

ఇప్పుడు బాక్స్ ఆఫీస్ మళ్ళీ పూర్తి స్థాయిలో గాడిలో పడాలంటే న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రం కచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. నాని మరోసారి భారీ హిట్ కొట్టబోతున్నాడు అనేలా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి పేరొచ్చింది. అయితే ఈ చిత్రం గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బయటపడ్డాయి. అదేమిటంటే ఈ సినిమాని ముందుగా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ నాని తో చెయ్యాలని అనుకోలేదట. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో చెయ్యాలని అనుకున్నాడట. సాయి ధరమ్ తేజ్ కి బైక్ యాక్సిడెంట్ జరగకముందు ఈ స్టోరీ ని వినిపించాడు. కానీ కొత్త రకం కాన్సెప్ట్, పైగా వివేక్ ఆత్రేయ గత చిత్రం ‘అంటే సుందరానికి’ పెద్ద ఫ్లాప్ అయ్యింది, ఇలాంటి సమయంలో రిస్క్ చెయ్యడం ఎందుకు అని, ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. అయితే ‘అంటే సుందరానికి’ సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా వివేక్ ఆత్రేయ ని ‘మంచి కాన్సెప్ట్ తో రా, మళ్ళీ నీతో కలిసి పని చెయ్యాలని ఉంది’ అని అన్నాడట.

అప్పుడు వివేక్ ఆత్రేయ తన దగ్గరున్న మూడు స్టోరీ లైన్స్ ని నాని కి వినిపించాడట. కానీ ఎందుకో అవి నాని కి నచ్చలేదు. ఆ తర్వాత కొన్నాళ్ళకు సాయి ధరమ్ తేజ్ కి చెప్పిన స్టోరీ లైన్ నాని కి చెప్తే కచ్చితంగా ఒప్పుకుంటాడు అనే నమ్మకంతో నాని కి చెప్పాడట. కొత్తరకం కథలను చేసేందుకు ఎంతో ఉత్సాహం చూపించే నాని, ఈ సినిమాని కథ విన్న వెంటనే ఒప్పుకున్నాడట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. మరి సాయి ధరమ్ తేజ్ ఈ ప్రాజెక్ట్ ని వదులుకొని మంచి నిర్ణయం తీసుకున్నాడా?, లేదా పొరపాటు చేశాడా అనేది మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper