Manchu Manoj Birthday Announcement: సినిమాలకు చాలా ఏళ్ళు గ్యాప్ ఇచ్చి , ‘భైరవం’ చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ కెరీర్ మళ్ళీ ఊపందుకుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గత ఏడాది తన కుటుంబం లో చోటు చేసుకున్న గొడవలు కూడా మంచు మనోజ్ కి బాగా కలిసొచ్చింది. ఆయనపై ఆడియన్స్ లో సానుభూతి పెరిగింది. అదే విధంగా ‘భైరవం’ చిత్రం యావరేజ్ రేంజ్ లో ఆడింది , ఇందులో మనోజ్ కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించాడు. ఇలాంటి రోల్ ఆయనకు ఇదే తొలిసారి. ఆ తర్వాత తేజ సజ్జ హీరో గా నటించిన ‘మిరాయ్’ చిత్రంలో కూడా మనోజ్ విలన్ గా నటించాడు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
ఈ సినిమా సక్సెస్ మనోజ్ కి ఇచ్చిన కిక్ మామూలుది కాదు , సంబరాలు చేసుకున్నాడు. నేటి తరం ఆడియన్స్ కి విలన్ గా పరిచయమై అలరించడంతో , ఇప్పుడు మళ్లీ హీరో గా మారాడు. ఇప్పటికే ‘డేవిడ్ రెడ్డి’ అనే చిత్రం లో హీరో గా నటిస్తున్న ఆయన , నేడు తన పుట్టిన రోజు సందర్భంగా మరో క్రేజీ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించాడు. ఈ చిత్రం పేరు ‘వడ్డీకాసులవాడు’. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వీడియో ని మనోజ్ తన మార్క్ స్టైల్ తో నేడు ప్రకటించాడు. అది చూసేందుకు చాలా సరదాగా అనిపించింది. వెంకటేశ్వర స్వామి తో తన కోరికలు వెల్లడిస్తూ , తన మార్క్ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు మనోజ్. ఈ చిత్రాన్ని AK ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుండగా , మంచు మనోజ్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
ఈ గ్లింప్స్ విశేషాల్లోకి వెళ్తే ఉద్యోగం చేసుకునే ఒక సగటు యువకుడు పడే కష్టాలను ఆధారంగా చేసుకొని తెరకెక్కించినట్టు తెలుస్తోంది . వెంకటేశ్వర స్వామి ని మొక్కుకుంటూ తనకు ఉన్న అప్పులన్నీ తీరిపోయి , డబ్బులు బాగా సంపాదిస్తే , వాటితో ఒక కాలేజీ కడుతానని , విద్యార్థులకు ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తానని ఆయన మాట్లాడిన మాటలు హైలైట్ గా నిలిచాయి. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ గ్లింప్స్ వీడియో ని మీరు కూడా చూసేయండి. ఈ సినిమాతో పాటు , మనోజ్ మరో సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో మనోజ్ విలన్ గా నటించబోతున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా నేడు వెలువడింది.
#VaddiKaasulaVaada ఈసారి డైరెక్ట్‌గా కాలేజ్ మీదకే ఎక్కేసాడు #ManchuManoj
స్టూడెంట్స్‌కి ఏకంగా 25% ఫీజు డిస్కౌంట్ అంట pic.twitter.com/45WfyV9CHh
— CHITRAMBHALARE (@chitrambhalareI) May 20, 2026
