Manchu Lakshmi: హీరోల కుమార్తెలందు మంచు లక్ష్మి వేరయ్యా.. ఎందుకంటే హీరోల కూతుర్లు ఎక్స్ పోజింగ్ కి, అలాగే హీట్ బికినీలకు హాట్ భంగిమలకు చాలా దూరంగా ఉంటారు. కానీ మంచు లక్ష్మి మాత్రం అందాల ప్రదర్శన పై చిన్నచూపు చూడకుండా ఘాటు ఫోటోలతో రోజురోజుకు నెటిజన్ల పై విరుచుకు పడుతోంది. టాలీవుడ్ లో క్రమశిక్షణకు బ్రాండ్ అంబాసిడర్ గా పేరొందిన మోహన్ బాబు కూతురిగా తెలుగు తెర పై వ్యాఖ్యాతగా, నిర్మాతగా నటిగా లక్ష్మీ తనదైన ముద్ర వేసింది.
కానీ ఎన్ని ముద్రలు వేసినా ఆమె కెరీర్ మాత్రం నెమ్మదిగానే సాగుతోంది. అయినా నిరాశచెందకుండా గ్లామరస్ గా కనిపించేందుకు పరాయి భాషల భామలకు పోటీ ఇచ్చేలా ఘాటు ఫోటోషూట్ లతో హీట్ పెంచుతుంది. తాజాగా మంచు లక్ష్మి తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఒక హాట్ ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోలో వెరీ బోల్డ్ డ్రెస్ ధరించిన లక్ష్మి, తన అందాలు హైలైట్ అయ్యేలా ప్రత్యేక భంగిమ పెట్టి మరీ ఫోటో తీయించుకుంది. పైగా ఫోటోలో హస్కీ ఎక్స్ ప్రెషన్స్ కూడా ఇచ్చింది.
అంటే అందాల ప్రదర్శనతో సాగిన బోల్డ్ ఫోజుల పథకం అన్నమాట. నిజానికి గత కొన్ని నెలలుగా ఈ ఘాటు ఉద్యమం కొనసాగిస్తూ వస్తోన్న మంచు లక్ష్మి తాజాగా ఒలకబోసిన వయ్యారాల పరిధి మాత్రం అందాల విద్వాంసులకు నాంది పలికింది. ఏది ఏమైనా ఆమె మంచు వారసురాలు. అసలు ఆమె గురించి చెప్పాలంటే.. మంచు వారి అమ్మాయి మహా ఘాటురా మామా అని ఏదో రైమింగ్ పదాలతో ఓ రేంజ్ లో ఇంట్రో ఇస్తే కానీ సరిపోదు.
సహజంగానే అందంగా, ఘాటుగా ఉండడం మంచు లక్ష్మి హాబీ. అందుకే నెటిజన్లు కూడా పట్ల ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తారు. అందుకే ఆమె గారి వైరల్ క్లిప్పుల గురించి, ఆమె మాటల విరుపుల గురించి తెలియని జీవి నెట్టింట ఉండడు. ఇక ఈ ఫోటోకు మంచు అభిమానుల హృదయాల్లో మంచు లక్ష్మి మంటలు పెడుతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాలుగేళ్ళ క్రితం వరకు వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరించిన మంచు లక్ష్మీ, ప్రస్తుతం నిర్మాతగా ఒక సినిమా నిర్మించడానికి కసరత్తులు చేస్తోంది.