Mana Shankara Vara Prasad Garu 50 days centers list: ఒకప్పుడు ఒక సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యింది అనేది చూడడానికి , ఆ సినిమా ఎన్ని కేంద్రాల్లో అర్థ శత దినోత్సవం జరుపుకుంది?, ఎన్ని సెంటర్స్ లో వంద రోజులు ఆడింది అనేది చూసేవారు. కానీ ఇప్పుడు కలెక్షన్స్ తప్ప ఇలాంటివి అసలు పట్టించుకోవడం లేదు . ఎంత పెద్ద సూపర్ హిట్ సినిమాని అయినా సరే ప్రస్తుతం ఉన్న ఓటీటీ యుగం లో రెండు మూడు వారాలు థియేటర్స్ లో ఒక సినిమా ఆడితే పెద్ద విషయం అయిపోతుంది . అలాంటిది ఈరోజుల్లో కూడా ఒక సినిమా 50 రోజులు అత్యధిక సెంటర్స్ లో పూర్తి చేసుకోబోతుందం అనేది సాధారణమైన విషయం కాదు. ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
కలెక్షన్స్ పరంగా రీజనల్ లాంగ్వేజ్ లో ఆల్ ఈమె ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన ఈ సినిమా 50 రోజుల కేంద్రాల విషయంలో కూడా సరికొత్త రికార్డుని నెలకొల్పబోతుంది. విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం వందకి పైగా సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది అట. నెల్లూరు లో సిరి మల్టీ ప్లెక్స్ లో ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది. అదే విధంగా ఆ జిల్లాలో బుచ్చి రెడ్డి పాలెం , రాజు పాలెం వంటి ప్రాంతాల్లో కూడా ఈ ఇనెమ 50 రోజులు పూర్తి చేసుకోనుంది.
అదే విధంగా సీడెడ్ , వైజాగ్ , కృష్ణ , ఉభయ గోదావరి జిల్లాలు గుంటూరు జిల్లాలు , ఇలా అన్ని జిల్లాలోనూ ఈ సినిమా ని 50 రోజులు ప్రసాదించబడబోతోంది. ఇన్ని సెంటర్స్ లో 50 రోజులు జరగడంతో మేకర్స్ అందుకు సంబంధించిన ఫంక్షన్ ని భారీ రేంజ్ లో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారట. త్వరలోనే ఈ ఈవెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ సృష్టించిన కూడా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సెంటర్స్ లో 50 రోజులు రన్ అవ్వలేకపోయింది . మరోవైపు సరిగ్గా 50 వ రోజున ఈ సినిమాని టీవీ లో కూడా టెలికాస్ట్ చేయబోతున్నారు . రీసెంట్ గానే ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది . అప్లోడ్ చేసిన మొదటి వారం లోనే ఈ చిత్రానికి 500 వాచ్ మినిట్స్ వచ్చాయట . ఇక రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో చూడాలి.