Homeఎంటర్టైన్మెంట్Ghajini Child Artist: 'గజినీ ' లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఈ చిన్నారి.. ఇప్పుడు...

Ghajini Child Artist: ‘గజినీ ‘ లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఈ చిన్నారి.. ఇప్పుడు సూర్య సినిమాలో హీరోయిన్ ..ఎవరో చెప్పుకోండి చూద్దాం!

Ghajini Child Artist: తమిళ హీరో సూర్య మన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ, డైరెక్టర్ వెంకీ అట్లూరి తో చేస్తున్న ‘విశ్వనాధ్ & సన్స్’ మూవీ కి సంబంధించిన టీజర్ ని నిన్న విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో సూర్య 40 ఏళ్ళ వయస్సు వాడిగా కనిపించగా, హీరోయిన్ మమిత బైజు 20 ఏళ్ళ అమ్మాయిగా కనిపించింది. ఆమె సూర్య వెంట పడడం, నీకు నాకు […]

Ghajini Child Artist: తమిళ హీరో సూర్య మన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ, డైరెక్టర్ వెంకీ అట్లూరి తో చేస్తున్న ‘విశ్వనాధ్ & సన్స్’ మూవీ కి సంబంధించిన టీజర్ ని నిన్న విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో సూర్య 40 ఏళ్ళ వయస్సు వాడిగా కనిపించగా, హీరోయిన్ మమిత బైజు 20 ఏళ్ళ అమ్మాయిగా కనిపించింది. ఆమె సూర్య వెంట పడడం, నీకు నాకు 20 ఏళ్ళ గ్యాప్ ఉంది , మనకి సెట్ అవ్వదు అంటూ సూర్య అనడం, కానీ అతని ప్రేమ కోసం ఈమె పరితపించడం వంటివి ఈ టీజర్ లో చూపించారు. అయితే సూర్య , మమిత బైజు కలిసి నటించడం ఇదే తొలిసారి అనుకుంటే పెద్ద పొరపాటే. గతం లో వీళ్లిద్దరు కలిసి ఒక సినిమాలో నటించారట.

Also Read: విజయ్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ మండిపాటు.. వీడియో వైరల్!

పూర్తి వివరాల్లోకి వెళ్తే మమిత బైజు బాలనటిగా మలయాళం , తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అలా ఈమె సూర్య ‘గిజిని’ చిత్రం లో కూడా నటించిందని అంటున్నారు. సూర్య ని సౌత్ ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ని చేసిన చిత్రమిది. తెలుగు లో అయితే ఆయనకు ఇక్కడి స్టార్ హీరోలతో సమానమైన మార్కెట్ కి క్రియేట్ చేసింది. అలాంటి సినిమాలో మమిత బైజు నటించిందట. క్లైమాక్స్ లో విలన్స్ ని చంపేసిన తర్వాత సూర్య కారులో వెళ్తూ ఒక రోడ్డు సిగ్నల్ వద్ద ఆగుతాడు గుర్తుందా?, అక్కడ ఒక్క చిన్న పిల్ల సూర్య ని వెనక్కి తిరిగి చూసి నవ్వుతూ ముందుకెళ్తుంది. ఆ చిన్నారి మరెవరో కాదు, మమిత బైజు అట. ఈ విషయాన్నీ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నిన్న కనిపెట్టారు. దీంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గతం లో కూడా హీరోయిన్ కృతి శెట్టి బాల్యం లో ఉన్నప్పుడు సూర్య సోదరుడు కార్తీ హీరోగా నటించిన ‘నా పేరు శివ ‘ చిత్రం లో కూడా నటించింది అంటూ అప్పట్లో ఫోటోలు సిర్క్యులేట్ చేశారు. ఇప్పుడు మమిత బైజు గురించి అదే తరహాలో సిర్క్యులేట్ చేస్తున్నారు. దీనిని బట్టీ అన్నదమ్ములు ఇద్దరు బాలనటీమణులను హీరోయిన్స్ గా పెట్టుకొని సినిమాలు చేయడమే టార్గెట్ అన్నట్లుగా తయారైంది పరిస్థితి అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ ట్రోల్స్ వేస్తున్నారు. మరి దీనిపై మమిత బైజు రెస్పాన్స్ ఇస్తుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper