Homeఎంటర్టైన్మెంట్'మేజర్' రిలీజ్ డేట్ ప్రకటించిన మహేష్ బాబు

‘మేజర్’ రిలీజ్ డేట్ ప్రకటించిన మహేష్ బాబు

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ టాలెంటెడ్ హీరోల్లో అడవి శేష్ ఒకరు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ… వరుసగా క్షణం, గూఢచారి, ఎవరు మూవీలతో విజయాలను సొంతం చేసుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న మూవీ ‘మేజర్’ లో అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ […]

Major movie
టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ టాలెంటెడ్ హీరోల్లో అడవి శేష్ ఒకరు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ… వరుసగా క్షణం, గూఢచారి, ఎవరు మూవీలతో విజయాలను సొంతం చేసుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న మూవీ ‘మేజర్’ లో అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.

Also Read: రివ్యూ : ’30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా’ – బోరింగ్ లవ్ డ్రామా !

ఇటీవల అడివి శేష్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ‘మేజర్’ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి మహేష్ బాబు తన ప్రొడక్షన్ హౌస్ లో ఈ మూవీని ప్రొడ్యూస్ చేయటంతో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ రోజు ఉదయం మేజర్ మూవీ జులై 2వ తేదీన విడుదల కానుందని మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించాడు. అంతే కాకుండా ఆ రోజుని “మేజర్ డే ” గా అభివర్ణించారు.

Also Read: ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్ ప్రేయసిని చూపించిన రాజమౌళి

ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం 75 శాతం‌ షూటింగ్ పూర్తయిందని త్వరలో ప్యాకప్ చెప్పేసి పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం కేటాయించాలని చిత్ర యూనిట్ భావిస్తోందని సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper