Krishna Advice Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే టాప్ హీరోగా మారాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఆయన ఇక మీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’ సినిమా ఫినిష్ అయిన వెంటనే మరో టాప్ డైరెక్టర్ తో సినిమా స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఇప్పుడు చేస్తున్న వారణాసి సినిమా మీద దాదాపు 1500 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తున్నారు. కాబట్టి ఈ సినిమా ఈజీగా 3000 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టాలి. లేకపోతే మాత్రం చాలా నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.
అలాగే రాజమౌళి సైతం తన మార్కెట్ ను మరింత పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుందో దాన్ని బట్టి రాజమౌళి యొక్క బ్రాండ్ అయితే క్రియేట్ అవుతుంది. మరి హాలీవుడ్ డైరెక్టర్లతో పోటీకి దిగాలి అంటే ఇంతకు మించిన బ్రాండ్ ను క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది…
రాజమౌళి సైతం చాలా ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం ఆయనకి ఇక తిరిగి ఉండదనే చెప్పాలి. ఇక మహేష్ బాబు గతంలో కొన్ని సినిమాలను ఫైనల్ చేసేటప్పుడు సూపర్ స్టార్ కృష్ణ సలహాలను ఇస్తూ ఉండేవాడు. కెరియర్ స్టార్టింగ్ లో చాలా సినిమాలను కృష్ణ ఫైనల్ చేశాడు…
ఒక సినిమా విషయంలో మహేష్ బాబు కృష్ణ సలహా తీసుకోకుండా సినిమా కథనైతే ఫైనల్ చేశారట. కానీ కృష్ణ మాత్రం ఆ కథ నీకు సెట్ అవ్వదని మహేష్ తో చెప్పి దాన్ని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దాంతో మహేష్ బాబు కొంతవరకు ఫీల్ అయ్యారట. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘గోదావరి’ సినిమా కావడం విశేషం… మహేష్ బాబుకి శేఖర్ కమ్ముల మొదట గోదావరి సినిమా కథనైతే వినిపించాడు. మహేష్ బాబుకి చాలా బాగా నచ్చిందట. కానీ మహేష్ మాస్ హీరోగా మారాలి అంటే ఇలాంటి సినిమాలు చేయకూడదు అనే ఉద్దేశ్యంతో కృష్ణ దాన్ని రిజెక్ట్ చేసారట…