Mahendra Giri Varahi: సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మహేంద్ర గిరి వారాహి సినిమా 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది… డివోషనల్ మిస్టేక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను రీసెంట్ గా సెన్సార్ బోర్డు వాళ్ళు చూసి సినిమాకి యూబైఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు మెంబర్స్ సినిమా మీద వాళ్ళ స్పందన తెలియజేశారు. వాళ్ళు చెప్పిన విషయాలను బట్టి ఈ సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం…
మహేంద్రగిరి రాజవంశంలో ఉన్న ప్రతి మగ బిడ్డ 33 సంవత్సరాలకు చనిపోతూ ఉంటారు. ఇక ఇది వారాహి అమ్మవారు ఆ కుటుంబానికి పెట్టిన శాపమట. ఇక ఈ శాపంలో భాగంగానే హీరో ఏం చేశాడు. ఈ చావుల వెనక కారణమేంటి అనేది ఈ సినిమా కథగా తెలుస్తుంది…
ఈ మూవీని చూసిన సెన్సార్ బోర్డు మెంబెర్స్ ఫస్టాఫ్ చాలా అద్భుతంగా ఉంది. సెకండాఫ్ లో హై ఇచ్చే ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయని అలాగే ట్విస్టులు కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి అంటూ సెన్సార్ బోర్డు మెంబర్స్ వారు ఈ సినిమా మీద ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ముఖ్యంగా వారాహి అమ్మవారు గొప్పతనాన్ని తెలిపేలా ఈ సినిమా ఉందని ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు.
సెప్టెంబర్ 11వ తేదీన రాబోతున్న ఈ సినిమా మీద సెన్సార్ బోర్డు మెంబర్స్ ఇచ్చిన రివ్యూ ని బట్టి చూస్తే ఈ సినిమా మీద అంచనాలు అమాంతం తారాస్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని వాళ్ళు చెబుతుండటం విశేషం…రీసెంట్ గా రవితేజ హీరోగా వచ్చిన ఇరుముడి సైన్సును చూసినప్పుడు సెన్సార్ బోర్డు వాళ్ళకి ఎలాంటి ఫీల్ కలిగిందో ఈ మూవీ చూసినప్పుడు అలాంటి ఒక వైబ్ క్రియేట్ అయిందని వాళ్ళు చెబుతుండటంతో చాలా మంది ప్రేక్షకులు సెప్టెంబర్ 11 వ తేదీ కోసం వెయిట్ చేస్తున్నారు…