spot_img
Homeఎంటర్టైన్మెంట్Kalyan Ram Speech In Bimbisara Event: ఎన్టీఆర్ పై ప్రేమ ...

Kalyan Ram Speech In Bimbisara Event: ఎన్టీఆర్ పై ప్రేమ కళ్ళల్లో కనిపిస్తోంది.. కళ్యాణ్ రామ్ స్పీచ్ వైరల్ !

Kalyan Ram Speech In Bimbisara Event: నందమూరి కళ్యాణ్ రామ్ కి ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది. కొత్తవాళ్లను ముఖ్యంగా కొత్త దర్శకుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడనే సాఫ్ట్ కార్నర్ ఉంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అనిల్ రావిపూడి, సురేందర్ రెడ్డి లాంటి కొంతమంది దర్శకుల్ని కళ్యాణ్ రామే పరిచయం చేశాడు.

Kalyan Ram Speech In Bimbisara Event
Kalyan Ram

ఈ క్రమంలోనే తన ‘బింబిసార’ సినిమాతో మరో కొత్త దర్శకుడు వశిష్టను పరిచయం చేస్తున్నాడు. ఈ ‘బింబిసార’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిన్న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చాడు. అయితే, హీరో కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ గురించి ఈవెంట్ లో మాట్లాడిన మాటలను ప్రస్తుతం ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడాడు ?, కల్యాణ్ రామ్ మాటల్లోనే విందాం.

‘ఈ ‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి ముఖ్య అతిథిగా వచ్చిన నా తమ్ముడు ఎన్టీఆర్ కు నేను థ్యాంక్స్ చెప్పను. థ్యాంక్స్ కు బదులు లవ్యూ అంతే..’ అంటూ ఎన్టీఆర్ పై తన ప్రేమను ప్రదర్శించాడు కళ్యాణ్ రామ్. నిజానికి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ గురించి మాట్లాడింది ఇంతే. కానీ.. కళ్యాణ్ రామ్ స్పీచ్ ఎందుకు వైరల్ అవుతుంది.

Kalyan Ram Speech In Bimbisara Event
Kalyan Ram, NTR

ముఖ్యంగా ఎన్టీఆర్ గురించి చెప్పిన మాటలను ఎందుకు వైరల్ చేస్తున్నారు అంటే.. కారణం ఉంది. కళ్యాణ్ రామ్ కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఎన్టీఆర్ ఇలాగే ముందుకు వచ్చి అతన్ని ఆదుకున్నాడు. పైగా ఎన్టీఆర్ ఆర్ట్స్ లో రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా చేసి.. కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ ను నిలబెట్టాడు. అందుకే.. ఎన్టీఆర్ గురించి మాట్లాడే సమయంలో ఎన్టీఆర్ పై తనకున్న ప్రేమ కళ్యాణ్ రామ్ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

మొత్తమ్మీద ‘త్రిగ‌డ్త‌ల రాజ్య‌పు నెత్తుటి సంత‌కం – బింబిసారుడి ఏక ఛాత్రాధిప‌త్యం’ అంటూ నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా ఈ ‘బింబిసార’ సినిమాని తీసుకువస్తున్నాడు. ఎ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌.. అన్నది ఉపశీర్షిక. ”ఓ స‌మూహం తాలుకూ ధైర్యాన్ని ఓ ఖ‌డ్గం శాశిస్తే.. కొన్ని వంద‌ల రాజ్యాలు ఆ ఖ‌డ్గానికి త‌ల‌వొంచి బానిస‌లైతే.. అదే ‘బింబిసారుడి విజయం. ఆ విజయాన్ని ఆస్వాదించడానికి ఆ బింబిసారుడి మళ్లీ పుడితే.. అనే కోణంలో తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

పొగ‌రుతో ఓ రాజ్యం మీసం మెలేసినట్టు.. కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో తన మీసం మెలేశాడు. ఏది ఏమైనా విజ‌య‌మో, వైఫ‌ల్య‌మో – ఏదీ ప‌ట్టించుకోకుండా ప్ర‌యోగాల చేస్తూనే వెళ్తుంటాడు క‌ల్యాణ్ రామ్‌. కొత్త క‌థ‌ల్ని తెర‌కెక్కించ‌డం అంటే త‌న‌కు భ‌లే స‌ర‌దా. బింబిసార‌ కూడా అలాంటి ప్ర‌య‌త్న‌మే. ఈ ప్రయత్నం మంచి విజయం సాధించాలని ఆశిద్దాం.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Bhogapuram International Airport

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...
Thammineni Seetharam

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...
Chennai Love Story Movie

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...
YSRCP

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....
Oktelugu Epaper