spot_img
Homeఎంటర్టైన్మెంట్Lavanya Tripathi Emotional: ఆ డైరెక్టర్ వేధింపులు తట్టుకోలేక ఏడ్చేశాను అంటూ ఎమోషనల్ అయిన లావణ్య...

Lavanya Tripathi Emotional: ఆ డైరెక్టర్ వేధింపులు తట్టుకోలేక ఏడ్చేశాను అంటూ ఎమోషనల్ అయిన లావణ్య త్రిపాఠి!

Lavanya Tripathi Emotional: సినీ ఇండస్ట్రీ లో ఆడవాళ్ళని గౌరవించే దర్శక నిర్మాతలు , హీరోలు ఉన్నారు, అదే విధంగా ఆడవాళ్లను ఆటవస్తువులు లాగా చూసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత టాలెంట్ ఉన్నా, అందం ఉన్నా అనవసరం, తమకు కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు ఇస్తామంటూ డిమాండ్ చేసిన దర్శకనిర్మాతలు ఎంతో మంది ఉన్నారు. ఒక్క తెలుగు ఇండస్ట్రీ లోనే కాదు, ప్రతీ ఇండస్ట్రీ లోనూ ఈ క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న ఎంతో మంది, ఇలాంటి సమస్యలను గతం లో ఎదురుకొని వచ్చిన వాళ్ళే. అలాంటి వారిలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి కూడా ఉంటుందని అసలు అనుకోలేదు. రీసెంట్ గా ఈమె పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో , తన కెరీర్ ప్రారంభం లో జరిగిన కొన్ని సంఘటనలు చెప్పుకొని ఎమోషనల్ అయ్యింది.

Also Read: ‘ధురంధర్ 2’ తో పోటీ పడడం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీం చేసిన పెద్ద మిస్టేక్.. ఓవర్సీస్ లో చావు దెబ్బ!

ఆమె మాట్లాడుతూ ‘తమిళం లో ఒక సినిమా చేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్ నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు. అతని ప్రవర్తన నచ్చక , ఎక్కడో తప్పు జరుగుతోంది అనే విషయాన్నీ గ్రహించి, ఆ సినిమా నుండి తప్పుకున్నాను. కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు నన్ను వదల్లేదు. నా పై అసత్య ప్రచారాలు చేయడమే కాకుండా, తప్పుడు కేసులు పెట్టి, నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీస్తూ ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. ఆ సమయం లో నాకు తోడుగా ఎవ్వరూ లేరు. నా బాధని ఎవరికీ చెప్పుకోవాలో అర్థం కాలేదు. తీవ్రమైన మానసిక ఒత్తిడి కి , ఆవేదనకు గురయ్యాను. నాలుగు గోడల మధ్య కూర్చొని ప్రతీ రోజు ఏడ్చేదాన్ని ‘ అంటూ చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి. తెలుగు , తమిళ భాషల్లో అంత మంచి క్రేజ్ సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి కి కూడా కెరీర్ ఆరంభం లో ఇలాంటి పరాభవం ఎదురైందంటే , ఇక కొత్తగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే అమ్మాయిల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి.

ఇకపోతే లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర పోషించిన ‘సతీ లీలావతి’ చిత్రం ఈ నెల 6వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ ఎందుకో కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఈ సినిమాని వాయిదా వేశారు. ఎప్పుడు విడుదల అవ్వబోతుంది అనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. రీసెంట్ గానే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి, ఒక పక్క తన బిడ్డ బాగోగులు చూసుకుంటూనే , మరోపక్క తన కెరీర్ మీద కూడా ఫోకస్ పెట్టింది. పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందో లేదో అని అనుకున్నారు కానీ, నాన్ స్టాప్ గా సినిమాలు చేయనుంది లావణ్య.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular