Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Bobby New Movie: డైరెక్టర్ బాబీ కి చిరంజీవి పెట్టిన మూడు కండిషన్స్...

Chiranjeevi Bobby New Movie: డైరెక్టర్ బాబీ కి చిరంజీవి పెట్టిన మూడు కండిషన్స్ ఇవేనా..?

Chiranjeevi Bobby New Movie: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్లలో చిరంజీవి ఒకరు. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ముందుకు తీసుకెళ్లిన ఘనత కూడా తనకే దక్కుతుంది. సినిమా హీరో ఎలా ఉండాలి. ప్రేక్షకుడి అంచనాలను అందుకోవాలి అంటే మనం ఏం చేయాలి అనే విషయాలను తెలుసుకొని ప్రేక్షకుడికి నచ్చే సినిమాలను చేస్తూ టాప్ హీరోగా మారిపోయాడు. ఇలాంటి […]

Chiranjeevi Bobby New Movie: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్లలో చిరంజీవి ఒకరు. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ముందుకు తీసుకెళ్లిన ఘనత కూడా తనకే దక్కుతుంది. సినిమా హీరో ఎలా ఉండాలి. ప్రేక్షకుడి అంచనాలను అందుకోవాలి అంటే మనం ఏం చేయాలి అనే విషయాలను తెలుసుకొని ప్రేక్షకుడికి నచ్చే సినిమాలను చేస్తూ టాప్ హీరోగా మారిపోయాడు. ఇలాంటి చిరంజీవి ప్రస్తుతం 70 సంవత్సరాల వయసులో కూడా ఎక్కడా తగ్గకుండా తనకంటూ ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఈ సంవత్సరం ఇప్పటికే ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించిన ఆయన ఇప్పుడు మరోసారి బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఇంతకుముందు వీళ్ళ కాంబినేషన్ లో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో వీళ్ళ కాంబినేషన్ కి భారీ క్రేజ్ వచ్చింది.

Also Read: ‘ధురంధర్ 2’ తో పోటీ పడడం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీం చేసిన పెద్ద మిస్టేక్.. ఓవర్సీస్ లో చావు దెబ్బ!

దాంతో మరోసారి వీళ్ళు చేస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఈ సినిమా కోసం చిరంజీవి బాబీ కి మూడు కండిషన్లు పెట్టాడట. అవి ఏంటి అంటే సినిమాను లిమిటెడ్ బడ్జెట్ లో కంప్లీట్ చేయాలని చెప్పారట.

అలాగే ఎలాగైతే కథ రాసుకున్నారో దాన్ని అలాగే స్క్రీన్ మీద ప్రజెంట్ చేయమని చెప్పారట… ఇక అనుకున్న డేట్స్ అసలు మించి పోకూడదని వీలైతే అంతకంటే తక్కువ రోజుల్లోనే సినిమాని చేయాలని చెప్పారట. ఈ మూడు కండిషన్లకి బాబీ ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు చిరంజీవి అనిల్ రావిపూడి తో సినిమా చేశాడు.

కాబట్టి అనిల్ రావిపూడి అనుకున్న సమయం కంటే ముందే సినిమాను ఫినిష్ చేసి సూపర్ సక్సెస్ ని అందించాడు. అందువల్లే బాబీకి సైతం చిరంజీవి అలాంటి కండిషన్స్ ను పెడుతున్నారట… దీనివల్ల ప్రొడ్యూసర్స్ నష్టపోకుండా ఉంటారు. సినిమా సక్సెస్ అయిన అవ్వకపోయిన ప్రొడ్యూసర్ సేఫ్ జోన్ లో ఉంటారనే ఉద్దేశ్యంతోనే చిరంజీవి ముందు నుంచే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper