spot_img
Homeఎంటర్టైన్మెంట్Gollapudi Maruti Rao Wife: విషాదం: ఆ గొప్ప సహజ నటుడి సతీమణి...

Gollapudi Maruti Rao Wife: విషాదం: ఆ గొప్ప సహజ నటుడి సతీమణి ఇక లేరు !

Gollapudi Maruti Rao: సినిమా పరిశ్రమలో మరో కన్నీటి విషాదం చోటుచేసుకుంది. దివంగత నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు సతీమణి శివకామ సుందరి గారు మరణించారు. ఆమె వయసు 81 సంవత్సరాలు. వయోభారంతో చెన్నైలో ఆమె తుదిశ్వాస విడిచారు. హన్మకొండలో జన్మించిన శివకామ సుందరికి గొల్లపూడితో 1961లో వివాహమైంది. 2019 డిసెంబరులో గొల్లపూడి మారుతీరావు అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే.

Gollapudi Maruti Rao Wife
Gollapudi Maruti Rao Wife

అప్పట్లో, శివకామ సుందరి గారిని పెళ్లి చేసుకున్న తర్వాత మారుతీరావు గారికి ఉద్యోగం చేయాల్సిన అవసరం వచ్చింది. అది 1959వ సంవత్సరం. అప్పట్లో ఉద్యోగాలు రావడం కొంచెం కష్టంగా ఉన్న సమయం. అయితే, తనలోని రచన మారుతీ రావుకి ఆంధ్రప్రభ దినపత్రికలో ఉప సంచాలకునిగా ఉద్యోగం వచ్చేలా చేసింది. ఆ తర్వాత చిత్తూరులో పత్రిక యొక్క మరో ఎడిషన్ ప్రారంభించినపుడు, అక్కడ సంపాదక వర్గంలో పనిచేశాడు.

Also Read:నీ చల్లని దీవెనలు మరు జన్మలకు కావాలి – మెగాస్టార్ చిరంజీవి

ఆ తరువాత రేడియోలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్ గా ఎంపికై, హైదరాబాదుకు మారాడు. మొత్తమ్మీద మొత్తం ఇరవై సంవత్సరాలు పనిచేసి, అసిస్టెంట్ స్టేషను డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశాడు. తర్వాత ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా సినిమా రంగ ప్రవేశం చేసి.. గొప్పగా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు ఎంత పేరు వచ్చినా తన సతీమణి శివకామ సుందరి అంటే ఎంతో అభిమానం చూపేవారు.

Gollapudi Maruti Rao Wife
Gollapudi Maruti Rao Wife

అయితే, మాటల రచయితగా ‘ఆలయశిఖరం’తో మారుతీ రావుకి బాగా పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఆ సమయంలో ఆయనకు భోజనం చేయడానికి కూడా తీరిక ఉండేది కాదు. అందుకే, ఆ సమయంలో ఆయనకు గోరుముద్దలు కలిపి పెట్టేవారట శివకామ సుందరి గారు. ఆయనను ఎప్పుడు ఆమె చిన్నపిల్లడిలా ఎంతో అపురూపంగా చూసుకునే వారట. ఏది ఏమైనా ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, నటుడిగా ఐదు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నారు అంటే దానికి ముఖ్య కారణం శివకామ సుందరి గారే. .

మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున శివకామ సుందరి గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

Also Read: కాళేశ్వరంలో అవినీతి చేపలు.. విచారణ జరపాలంటున్న రేవంత్ రెడ్డి..

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper