Kumari Aunty-Alekhya Chitti : ఈరోజుల్లో కస్టమర్ సోషల్ మీడియాను విపరీతంగా ఫాలో అవుతున్నాడు. రేటింగ్స్.. క్వాలిటీ.. ట్రాన్స్పోర్ట్.. డెలివరీ అన్ని చూసుకుంటున్నాడు. అక్కడిదాకా ఎందుకు అంతటి అమెజాన్ , ఫ్లిప్కార్ట్ కూడా గ్రామాల బాట పట్టాయి. జస్ట్ రెండు రోజుల్లోనే డెలివరీ చేస్తున్నాయి. ఇక ప్రైమ్ కస్టమర్లకు అయితే ఒకరోజు వ్యవధిలోనే వారు ఆర్డర్ చేసిన ఉత్పత్తులను డెలివరీ చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే వ్యాపారంలో సరికొత్త విధానాలను అవలంబిస్తున్నాయి. ఎంత పెద్ద సంస్థలైనా సరే కస్టమర్లకు రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. పైగా గతానికంటే ఎక్కువగా ఇప్పుడు కస్టమర్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటుచేసి.. వినియోగదారులకు విలువైన సేవలు అందిస్తున్నాయి. ఈ సంస్థలను చూసి వర్ధమాన వ్యాపారులు చాలా నేర్చుకోవాలి. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన.. నాలుగు రీల్స్ చేసినంత మాత్రాన మనమే తోపులం అనుకుంటే కుదరదు.. ఎలాగూ రీచ్ పెరిగిందని రెచ్చిపోతే మొదటికే మోసం వస్తుంది.
Also Read : అంతలా తిట్టడం ఎందుకు.. ఇప్పుడు ఆ శోకం ఏంటి ‘అలేఖ్యచిట్టి’
వాక్ శుద్ధి ముఖ్యం
హైదరాబాదులో కుమారి ఆంటీ అంటే తెలియని వారు ఉండరు. అలాగని ఆమె చదువుకున్నది కాదు. సోషల్ మీడియా మీద పెద్దగా పట్టుకున్నది కూడా కాదు. బతుకుదెరువు కోసం ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చింది. ఓ ప్రముఖ సింగర్ ఇంట్లో పనిమనిషిగా చేరింది. ఆ తర్వాత ఒక చిన్న హోటల్ పెట్టుకుంది. తనకు మాత్రమే సాధ్యమైన వాక్చాతుర్యంతో ఆకట్టుకుంది. ఆమె వడ్డిస్తున్న తీరు.. మాట్లాడుతున్న తీరు సోషల్ మీడియాలోకి ఎక్కింది. ఇంకేముంది కుమారి ఆంటీ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. “మూడు చికెన్, నాలుగు లివర్లు.. మొత్తం మీ బిల్లు 1200 అయింది నాన్న” ఇలా డిఫరెంట్ స్లాంగ్ తో కుమారి ఆంటీ టీవీలకు కూడా వచ్చేసింది. ఆ మధ్య ఆమె హోటల్ ను తొలగించడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పూనుకుంటే.. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆమె పొట్ట మీద కొట్టొద్దని సూచించారు.. ఎంతమంది కస్టమర్లు వచ్చినా.. యూట్యూబ్ ఛానల్స్ ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కుమారి ఆంటీ తన స్థిర చిత్తాన్ని కోల్పోలేదు. తన మాట తీరును పోగొట్టుకోలేదు. అందువల్లే ఆమె ఈరోజు ఈ స్థాయిలో నిలబడింది. కానీ అలేఖ్య చిట్టి పీకిల్స్ ఇందుకు పూర్తి విరుద్ధం. ఒక కస్టమర్ తో ఎలా మాట్లాడుకూడదో అలా మాట్లాడింది. అతడు ఒక్కడే కాదు.. ధర గురించి మాట్లాడిన ప్రతి ఒక్క కస్టమర్ తోనూ తిక్క తిక్కగా మాట్లాడింది.. రాసేందుకు వీలు లేని బూతులతో రెచ్చిపోయింది. పచ్చడి ఏం కొంటావు గాని.. కెరీర్ మీద దృష్టి పెట్టు.. పెళ్లి ఏం చేసుకుంటావ్.. పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఏ విధంగా సాకుతావు అంటూ.. చెప్పడానికి వీలు లేని.. రాయడానికి సాధ్యం కానీ బూతుల తో రెచ్చిపోయింది.. సోషల్ మీడియా దెబ్బకు అన్ని మూసుకుంది. ఓ కుమారి ఆంటీ.. అలేఖ్య చిట్టి.. ఇద్దరు మహిళలే.. కాకపోతే ఒకరికి వాక్ శుద్ధి ఉంది.. ఇంకొకరికి నిలువెల్లా బలుపు ఉంది. దానికి ఎలాంటి సమాధానం ఇవ్వాలో.. అలాంటి సమాధానమే నెటిజన్లు ఇచ్చారు.
Also Read : హాస్పిటల్ పాలైన అలేఖ్య చిట్టి..ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉందంటే!