Sridevi Drama Company : కమెడియన్ హైపర్ ఆది గొప్ప మనసు చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. హైపర్ ఆది చేసిన పనికి ప్రశంసలు దక్కుతున్నాయి. శ్రీ దేవి డ్రామా కంపెనీ షో కి ప్రతి ఆదివారం స్పెషల్ గెస్టులు వస్తుంటారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్ళను ఈ షోకి ఆహ్వానిస్తుంటారు. కాగా ఈ వారం బిగ్ బాస్ శివాజీ, స్ట్రీట్ ఫుడ్ సెన్సేషన్ కుమారి ఆంటీ, అలాగే ఏషియన్ గేమ్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించిన తెలుగు అథ్లెట్ నందిని అగసర అతిథులుగా వచ్చారు.
ఇక ఎప్పటిలాగే హైపర్ ఆది కామెడీ పంచులతో నవ్వులు పూయించాడు. గోడపై వర్ష, ఇమ్మాన్యుయేల్ మధ్య అక్రమ సంబంధం ఉందని రాసి ఉండగా .. ఆది అందరినీ పిలిచి వాళ్ళ ఇద్దరి మధ్య సంబంధం ఉంది అంటరా.. అని కామెడీ చేస్తాడు. ఇక అక్రమ సంబంధాలు కనిపెట్టడానికి శ్రీ దేవి కంపెనీ వాళ్ళను పిలుస్తాడు. అయితే ఇంద్రజ తో ఈ అక్రమ సంబంధాలు అరికట్టాలని హైపర్ ఆది అంటాడు. దానికి కౌంటర్ గా… అయితే ముందుగా ఆపాల్సింది నువ్వే అంటూ ఇంద్రజ పంచ్ వేసింది.
ఇక శివాజీ .. ఇమ్మాన్యుయేల్, వర్ష, నరేష్ ఇంకొందరు కమెడియన్స్ తో కలిసి స్కిట్ చేశాడు. ఆ తర్వాత కుమారి ఆంటీ సందడి చేసింది. హాయ్ నాన్న బాగున్నారా అంటూ భోజనం వడ్డించింది. అందరూ కుమారి ఆంటీ చుట్టూ చేరి కామెడీ చేశారు. ఇక రష్మీ అథ్లెట్ నందిని ని స్టేజ్ పైకి ఆహ్వానించింది. అయితే అథ్లెట్ నందిని ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపింది. కనీసం తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నట్లు చెప్పుకొని బాధపడింది.
ఏషియన్ గేమ్స్ లో మెడల్ సాధించిన ఒక గొప్ప అథ్లెట్ కడుపునిండా భోజనానికి కూడా ఇబ్బందిపడటం అనేది ఊహించని పరిణామం. నందిని దుర్భర స్థితి చలించిపోయిన హైపర్ ఆది… ఆ ఎపిసోడ్ అమౌంట్ నందినికి సహాయంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. అలాగే ఇంద్రజ, తాగుబోతు రమేష్ సైతం నందినికి ఆర్థిక సాయం ప్రకటించారు. మంచు మనసు చాటుకున్న హైపర్ ఆదిపై సోషల్ మీడియాలో ప్రశంసలు వర్షం కురుస్తుంది. పలువురు కొనియాడుతున్నారు.