Kumari Aunty: బిగ్ బాస్ ఫేమ్ సీరియల్ నటి కీర్తి భట్(Keerthi Bhat) ఇటీవల కుమారి ఆంటీ ఫుడ్ అసలు బాగోలేదు అంటూ రివ్యూ ఇచ్చింది. కుమారి ఆంటీ పాపులారిటీ చూసి ఆమెను కలవాలని ఫుడ్ స్టాల్ వద్దకు కాబోయే భర్త కార్తీక్ తో కలిసి వెళ్ళింది. కుమారి ఆంటీ అక్కడ లేకపోవడంతో కనీసం ఫుడ్ అయినా టేస్ట్ చేద్దాం అని ఒక ప్లేట్ చికెన్ రైస్ తీసుకున్నారు. ఫుడ్ టేస్ట్ గా లేదని .. చికెన్ చాలా కారంగా ఉంది. ఒక్క ముద్ద కూడా తినలేక పోయాం. జనాలు ఎందుకు ఇంతలా ఆమె ఫుడ్ కోసం ఎగబడుతున్నారో తెలియడం లేదని కీర్తి ఎద్దేవా చేసింది. కుమారీ ఆంటీ ఫుడ్ నచ్చలేదంటూ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టారు.
దీంతో కొందరు నెటిజన్లు వాళ్ళను దారుణంగా ట్రోల్ చేశారు. ఇలా రివ్యూలు ఇచ్చి ఆమె పొట్ట కొట్టడం దేనికని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే… రోడ్ సైడ్ ఫుడ్ అంతకంటే బాగుంటుందా. మేము తెలుగు వాళ్ళం ఎక్కువ కారం తింటాం. మీరు కర్ణాటక వాళ్ళు .. కారం ఎక్కువ తినరు .. మీకు ఇక్కడ ఫుడ్ నచ్చకపోతే కర్ణాటక వెళ్లిపోండి… అంటూ దారుణంగా తిడుతున్నారు. దీంతో ఈ విషయం స్పందించిన కీర్తి ఫియాన్సీ కార్తీక్ నెటిజన్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
ఈ అంశంపై మాట్లాడుతూ వీడియో రిలీజ్ చేసాడు. ఈ క్రమంలో కార్తీక్ .. మేము రీసెంట్ గా కుమారీ ఆంటీ ఫుడ్ గురించి ఓ వీడియో చేసాము. దానిపై చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. మేము తెలంగాణ వాళ్ళం ఎక్కువ కారం తింటాము. మీకు కారం ఎక్కువైతే కర్ణాటక వెళ్లిపోండి అని అంటున్నారు. నేను కూడా రాయలసీమ వాడినే. నేను కారం ఎక్కువ తింటాను. మేము చేసిన పూర్తి వీడియో చూసి అప్పుడు మాట్లాడండి.
మేము చెప్పింది ఏంటంటే .. చికెన్ కర్రీలో కారం గురించి. ఆ రోజు మేము తిన్నప్పుడు కూరలో కారం, మసాలాలు ఎక్కువగా అనిపించాయి. మేము రివ్యూ ఇవ్వడం వల్లే కుమారి ఆంటీకి పెద్ద నష్టం జరిగినట్లు మాట్లాడుతున్నారు. కుమారి ఆంటీకి మా వల్ల బిజినెస్ లాస్ కావడం ఏంటి. మేము చెప్పగానే వాళ్లకి లాస్ రాదు. తినేవాళ్లు ఎలాగైనా తింటారు. కామెంట్ పెట్టే ముందు ఆలోచించి పెట్టండి అంటూ కార్తీక్ చెప్పుకొచ్చాడు