
Katrina Kaif: హీరోయిన్ కత్రినా కైఫ్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా నిండా హాట్ టాపిక్ అయింది. కత్రినా తన ప్రియుడు విక్కీ కౌశల్ ను గట్టిగా హగ్ చేసుకుంటూ కనిపించింది. ఈ వీడియోనే ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తోంది. విక్కీ కొత్త సినిమా ‘సర్దార్ ఉద్దం’ ప్రీమియర్ షో వేశారు. ఈ షోకి కత్రినా గెస్ట్ గా వచ్చింది. వస్తే వచ్చింది.. కానీ, అందరి ముందు అతగాడిని ఘాడంగా ఆలింగనం చేసుకుని వార్తలకెక్కింది.
అసలుకే బాలీవుడ్ మీడియాకి ఈ మధ్య మసాలా కంటెంట్ దొరకడం లేదు. ఇలాంటి సమయంలో కత్రినా తన బాయ్ ఫ్రెండ్ కి పబ్లిక్ గా ఘాటు ముద్దులు పెడుతూ గట్టిగా హగ్ చేసుకుంటే.. ఇక మీడియా ఎందుకు వదిలి పెడుతుంది ? అందుకే, ఈ వీడియో పైనే అనేక కథనాలను వండి వడ్డిస్తూనే ఉంది. చూసే జనం కూడా బోర్ గా ఫీల్ అవుతున్నారు తప్పితే.. ఈ వీడియోని మాత్రం మీడియా వదిలిపెట్టడం లేదు.
ఏది ఏమైనా ఈ వీడియో కత్రినా(Katrina Kaif) – విక్కీ ఘాటు రిలేషన్‌షిప్ కి సాక్ష్యం అయింది. ఇక కత్రినా తన పెళ్లి పై ఇప్పటికే నిర్ణయం తీసుకుందట. 40లోకి అడుగు పెట్టక ముందే పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోవాలని ప్లాన్ చేసుకుంది. ఈ క్రమంలో ఆమె తన ఎంగేజ్ మెంట్ ను విక్కీతో చేసుకుందని తెలుస్తోంది.
హీరో విక్కీ కౌశల్ కూడా కత్రినాను ప్రేమిస్తున్నాడు. స్టార్ హీరో రణబీర్ కపూర్, కత్రినాకి హ్యాండిచ్చి ఆమెను వదిలేసిన తర్వాత, ఒంటరితనంతో కత్రినా చాలా నలిగిపోయింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్, ఆమెకు ఓదార్పు యాత్ర చేపట్టాడు. మధ్యలో ఆమెతో డేటింగ్ కూడా స్టార్ట్ చేశాడు. ఇక విక్కీ కౌశల్ కి 33 ఏళ్ళు. అదే కత్రినాకి 38 ఏళ్ళు. అంటే ఆమె కంటే 5 ఏళ్ళు చిన్నవాడు.
అయినా ప్రేమకు వయసుతో సంబంధం ఏముంది లేండి. ప్రస్తుతానికి అయితే, కత్రినా, విక్కీ కౌశల్ ప్రేమలో మునిగి తేలుతూ సంతోషంగా లైఫ్ ను లీడ్ చేస్తోంది. అయితే, కత్రినా ఇప్పటికీ సల్మాన్ ఖాన్ తో సన్నిహితంగానే ఉంటుందని బాలీవుడ్ లో ఒక టాక్ ఉంది. కాబట్టి కత్రినా పెళ్లికి సల్మాన్ ఖాన్ అంగీకారం కూడా ముఖ్యమే.
View this post on Instagram