Kritishetty : యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఆమె డెబ్యూ మూవీ ఉప్పెన భారీ విజయం సాధించింది. ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఉప్పెన వసూళ్ల వర్షం కురిపించింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమయ్యాడు. దర్శకుడు బుచ్చిబాబుకు కూడా మొదటి చిత్రం. ఉప్పెన విజయం కృతికి వరుస ఆఫర్స్ తెచ్చిపెట్టింది. ఆమె గ్లామర్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఓ సాంగ్ లో శృంగారం కురిపించి గుండెల్లో సెగలు రేపింది.