‘బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి’ ఒక సాంగ్ విషయంలో తెగ ఫీల్ అయిపోతుంది. అది 1993 కాలం, ఆ ఏడాదిలో వచ్చిన ‘బాజిగర్’ చిత్రంలోని ‘ఏ కాలీ కాలీ’ అనే పాట సూపర్ హిట్ అయింది. ఇప్పటికీ ఆ పాటకు ఎంతో ఆదరణ ఉంది. షారుఖ్ ఖాన్, కాజోల్ పై చిత్రీకరించిన ఈ పాట, అప్పటి కుర్రాళ్లతో పాటు ఇప్పటి కుర్రకారు వరకూ ఈ పాట అనేక సార్లు గిలిగింతలు పెట్టింది. సంగీత ప్రియుల్ని ఓలలాడించింది.
అయితే, హిందీలో ప్రసారమయ్యే ‘సూపర్ డ్యాన్సర్ ఛాప్టర్ 4’ అనే రియాలిటీ షోలో నీర్జా, భావన అనే కంటెస్టెంట్లు ఈ సాంగ్ కి డ్యాన్స్ చేశారు. షారుక్ – కాజోల్ కెమిస్ట్రీకి ఏ మాత్రం తీసిపోని విధంగా కంటెస్టెంట్లు తన డ్యాన్స్ తో మెప్పించారు. అయితే, ఈ షోకి న్యాయ నిర్ణీతగా వ్యవహరిస్తున్న శిల్పాశెట్టి ఈ పాట గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.
కాజోల్ సాంగ్ పై ఈ భామ ఎమోషన్ అవడం ఎందుకంటే.. మంచి ఎనర్జీతో సాగే హుషారైన ఈ పాటలో తను డ్యాన్స్ చేయాలనుకున్నానని, కానీ ఈ పాట తనకు ఇవ్వలేదని, అందుకు ఇప్పటికీ కాజోల్ పై నేను ఈర్ష్యగా ఫీల్ అవుతాను అని చెప్పుకొచ్చింది. అనంతరం అదే స్టేజీపై గాయకుడు కుమార్ సానుతో కలిసి ఈ పాటకి డ్యాన్స్ చేసి, అలాగే తన పెళ్లి కుటుంబం పై కూడా క్లారిటీ ఇచ్చింది.
అన్నట్టు ‘బాజిగర్’ చిత్రంతోనే శిల్పాశెట్టి నటిగా మారిన సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్, కాజోల్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు అబ్బాస్- మస్తాన్ ఈ సినిమాని భారీ స్థాయిలో తెరకెక్కించారు. అను మాలిక్ అందించిన సంగీతం అప్పట్లో ఓ సంచలనం అనే చెప్పాలి. అయితే, ఇప్పటికీ ఈ సినిమాలోని గీతాలు వినిపిస్తూనే ఉండటం గొప్ప విశేషం.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Kali kali ankhen song makes shilpa shetty go green with jealousy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com