Homeఎంటర్టైన్మెంట్Shah Rukh Khan: ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్లకు బ్లాంక్ చెక్ ఇస్తున్న షారూక్ ఖాన్...

Shah Rukh Khan: ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్లకు బ్లాంక్ చెక్ ఇస్తున్న షారూక్ ఖాన్…

Shah Rukh Khan: ప్రస్తుతం పాన్ ఇండియాలో తెలుగు దర్శకులు తమ సత్తా చాటుతున్నారు. ఒకరుని మించిన వారు మరొకరుగా మారుతున్నారు. భారీ విజయాన్ని సాధిస్తూ తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఇక ఇప్పటివరకు వాళ్లు సాధించిన విజయాలు వాళ్ళను టాప్ రేంజ్ లో నిలబెట్టాయి. మరి ఇప్పటికైనా వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది.బాలీవుడ్ హీరోలు సైతం మన తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తిని […]

Shah Rukh Khan: ప్రస్తుతం పాన్ ఇండియాలో తెలుగు దర్శకులు తమ సత్తా చాటుతున్నారు. ఒకరుని మించిన వారు మరొకరుగా మారుతున్నారు. భారీ విజయాన్ని సాధిస్తూ తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఇక ఇప్పటివరకు వాళ్లు సాధించిన విజయాలు వాళ్ళను టాప్ రేంజ్ లో నిలబెట్టాయి. మరి ఇప్పటికైనా వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది.బాలీవుడ్ హీరోలు సైతం మన తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ సైతం ఒక ఇద్దరు తెలుగు దర్శకులకు బ్లాంక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో ఒకరు బుచ్చిబాబు కాగా, మరొకరు గోపీచంద్ మలినేని గా తెలుస్తుంది. వీళ్లిద్దరు కమర్షియల్ సినిమాలను తీయడంలో చాలా మంచి పేరు ఉన్న దర్శకులు…కాబట్టి షారుక్ ఖాన్ సైతం వీళ్లిద్దరితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడట. ఇక బుచ్చిబాబు పెద్ది సినిమా చేశాడు.

జూన్ నెలలో ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఈ సినిమా తర్వాత షారుక్ ఖాన్ సినిమా చేయబోతున్నాడు అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది తెలియదు. కానీ గోపీచంద్ మలినేని సైతం గత సంవత్సరం సన్నిడియోల్ తో ‘జాట్’ అనే సినిమా చేసి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడు.

అందుకే షారుక్ ఖాన్ సైతం అతనితో సినిమా చేయాలని తనకు ఒక బ్లాంక్ చెక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది…ఇక ప్రస్తుతం గోపీచంద్ మలినేని బాలయ్య బాబుతో సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా పూర్తయిన తర్వాత షారుక్ ఖాన్ తో సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి… వీళ్ళిద్దరితో షారుఖ్ ఖాన్ భారీ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక ఇప్పటికే మన తెలుగు హీరోలు షారుక్ ఖాన్ ను బీట్ చేస్తు ముందుకు దూసుకెళ్తున్నారు. కాబట్టి ఈ సమయంలో అతనికి భారీ సక్సెస్ అవసరం ఉంది. ఇక షారుక్ ఖాన్ సైతం ఎలాగైనా సరే తను భారీ సక్సెస్ ను సాధించాలంటే తెలుగు దర్శకులతోనే సాధ్యమవుతుందని మన దర్శకులను ఏరికోరి మరి వాళ్ళతో సినిమాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper