Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్’ హిస్టరీ లో ఎప్పుడూ లేని విధంగా మొదటి వారం , ఆడియన్స్ ఓటింగ్ తో సంబంధం లేకుండా ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం , ఆ తర్వాత వీకెండ్ లో ఎలిమినేషన్ లేకుండా ఉండడం ఎప్పుడూ జరగలేదు. మొదటిసారి ఈ సీజన్ లోనే అలాంటి ఘటన జరిగింది. ఇక ప్రేక్షకుల ఓటింగ్ కి విలువ లేదు , ఓట్లు వేసి వేస్ట్ అని అందరూ అనుకుంటున్న సమయం లో , నిన్న కెప్టెన్సీ కంటెండర్స్ ని కూడా మీరే ఎంచుకోవచ్చు అని పోలింగ్ పెట్టడం అందరినీ షాక్ కి గురి చేసింది. బహుశా మొదటి వారం ఆడియన్స్ ఓటింగ్ కి విలువ ఇవ్వలేదు అని , పెద్ద ఎత్తున నెటిజెన్స్ సోషల్ మీడియా లో బిగ్ బాస్ టీం ని తప్పుబట్టడం చూసినందుకు వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండొచ్చు అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే , రెండవ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయ్యింది. దానికి సంబంధించిన ప్రోమో ని కూడా మీరు కాసేపటి క్రితమే చూసి ఉంటారు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం , ఈ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయిన ఇంటి సభ్యులు రోహిత్ , త్రిగున్ , ముకేశ్ , కృష్ణుడు , షాలిని , రామ్ ప్రసాద్ , ఝాన్సీ , సుధీర్ , దేబ్జాని, శ్రేష్టి. ఈ నామినేషన్స్ ప్రక్రియ లో సుధీర్ రెడ్డి ఇచ్చిన ట్విస్ట్ కి త్రిగున్ ఫ్యూజులు ఎగిరిపోయాయి అనే చెప్పాలి. సరైన పాయింట్స్ తో దుమ్ము దులిపేసాడు సుధీర్ రెడ్డి. ఇక ఆ తర్వాత త్రిగుణ రోహిత్ ని నామినేట్ చేయడం , అందుకు రోహిత్ గన్ షాట్ పాయింట్స్ తో డిఫెండ్ చేయడం హైలైట్ గా నిల్చింది.
ఇక నామినేషన్స్ మధ్యలో వర్షిణి , షాలిని మధ్య పెద్ద గొడవ జరగడం, వర్షిణి షాలిని పై ఫిజికల్ అటాక్ చేయడం పెద్ద సంచలనం రేపే అంశం అనే చెప్పాలి. దీనిపై వీకెండ్ లో నాగార్జున పెద్ద ఎత్తున కోటింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇదంతా పక్కన పెడితే , చివర్లో ముకేశ్ , రోహిత్ మధ్య జరిగిన గొడవ కూడా వేరే లెవెల్ లో ఉందట. ఇది కూడా సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారొచ్చు. ఓవరాల్ గా బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి ఫైర్ నామినేషన్స్ ని ఆడియన్స్ ఆశిస్తారో , అలాంటి ఫైర్ ఈరోజు ప్రేక్షకులు చూడబోతున్నారు. మరి ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు బయటకు వెళ్తారో చూడాలి.