Homeఎంటర్టైన్మెంట్Jr NTR Delhi High Court case: ఢిల్లీ హై కోర్టు లో జూనియర్ ఎన్టీఆర్...

Jr NTR Delhi High Court case: ఢిల్లీ హై కోర్టు లో జూనియర్ ఎన్టీఆర్ పోరాటం.. పాపం ఎంత కష్టమొచ్చింది..

Jr NTR Delhi High Court case: AI విపరీతంగా వ్యాప్తి చెందిన ఈ కాలం లో , కొంతమంది ఆకతాయిలు దానిని తప్పు పనులకు వాడుకుంటూ, సినీ సెలెబ్రెటీలకు లేనిపోని తలనొప్పులు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో సెలబ్రిటీలు వరుసగా తమ వ్యక్తిగత సమాచారాన్ని భద్రతా కలిపించాలంటే ఢిల్లీ హై కోర్టు ని ఆశ్రయిస్తున్నారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్ తో మొదలైన ఈ ట్రెండ్ రీసెంట్ గా అల్లు అర్జున్ వరకు చేరింది. అయితే ఈ జాబితాలో […]

Jr NTR Delhi High Court case: AI విపరీతంగా వ్యాప్తి చెందిన ఈ కాలం లో , కొంతమంది ఆకతాయిలు దానిని తప్పు పనులకు వాడుకుంటూ, సినీ సెలెబ్రెటీలకు లేనిపోని తలనొప్పులు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో సెలబ్రిటీలు వరుసగా తమ వ్యక్తిగత సమాచారాన్ని భద్రతా కలిపించాలంటే ఢిల్లీ హై కోర్టు ని ఆశ్రయిస్తున్నారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్ తో మొదలైన ఈ ట్రెండ్ రీసెంట్ గా అల్లు అర్జున్ వరకు చేరింది. అయితే ఈ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. ఊర మాస్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ కి ఎంతటి గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో, యాంటీ ఫ్యాన్స్ కూడా ఆయనకు అదే రేంజ్ లో ఉన్నారు. అనేక మంది నెటిజెన్స్ ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ , ఇష్టమొచ్చినట్టు అవహేళన చేయడం వంటివి గతం లో చాలానే చూశాము. అంతే కాకుండా ఎన్టీఆర్ పేరు ని చెడు పనులకు వాడుకొని అమాయకులను మోసం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అందుకే ఎన్టీఆర్ తన వ్యక్తిగత వేరు, ఫోటోలు , వీడియోలకు భద్రతా కల్పించాలని కోరుతూ కొన్నిరోజుల క్రితమే ఢిల్లీ హై కోర్టు లో పిటీషన్ వేశాడు. నేడు ఈ పిటీషన్ విచారణకు వచ్చింది. ఈ కేసు ని నేడు జస్టీస్ జ్యోతి సింగ్ తో కూడిన ధర్మాసనం విచారించనుంది. అంతే కాకుండా ఈ పిటీషన్ లో ఎన్టీఆర్ తరుపున న్యాయవాది, ఎన్టీఆర్ పేరు ని తన అనుమతో లేకుండా వినియోగించుకున్న పలు ఈ కామర్స్ వెబ్ సైట్స్ , ప్రైవేట్ సంస్థల పేర్లను చేర్చారు అట. వాళ్లకు శిక్ష పడుతుందో లేదో చూడాలి. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ మూవీ పై అభిమానుల్లో ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 13 న విడుదల చేయబోతున్నట్టు రీసెంట్ గానే అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. సీక్వెల్ ని కూడా అదే ఏడాది లో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట. అదే విధంగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని వచ్చే నెల 20 న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నారు మేకర్స్. దీనికి ఆడియన్స్ నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘ది గాడ్ ఆఫ్ వార్’ అనే చిత్రం చేయబోతున్నాడు. ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో అభిమానులను రాబోయే రోజుల్లో మెంటలెక్కిపోయేలా చేయబోతున్నాడు ఎన్టీఆర్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper