NTR Birthday: ‘దేవర’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్(Junior NTR) నుండి విడుదలైన ‘వార్ 2’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా తెలుగు వెర్షన్ కి కేవలం 72 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. దేవర తో 390 కోట్లు కొల్లగొట్టిన ఎన్టీఆర్ కి , ఇంత తక్కువ గ్రాస్ వసూళ్లు రావడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇకపోతే ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ తో ‘డ్రాగన్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు, ఎన్టీఆర్ భవిష్యత్తులో చేయబోయే మరో మూడు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చే నెల 20 న ఆయన పుట్టినరోజు సందర్భంగా రాబోతున్నాయి. మరి ఆ అప్డేట్స్ ఏంటో ఒకసారి వివరం గా చూద్దాము.
ముందుగా ‘డ్రాగన్’ మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్లింప్స్ వీడియో విడుదల అవుతుందని అంతా అనుకున్నారు కానీ, చివరికి ఫస్ట్ లుక్ మాత్రమే విడుదల చేయబోతున్నారని తెలిసింది. ఇది కాసేపు పక్కన పెడితే , ఆయన ‘దేవర 2’ చెయ్యడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కొరటాల శివ స్క్రిప్ట్ ని రెడీ చేసుకొని ఎన్టీఆర్ కాల్ షీట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రశాంత్ నీల్ మూవీ పూర్తి అవ్వగానే , ఎన్టీఆర్ ‘దేవర 2’ మొదలు పెట్టబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా మే 20 న రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు కాకుండా, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఆయన ‘గాడ్ ఆఫ్ వార్’ అనే చిత్రం చేయబోతున్నాడు. మురుగన్ స్వామి జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని తయారు చేసిన స్క్రిప్ట్ ఇది.
ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా మే 20 నే రాబోతుంది. వీటితో పాటు , తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ తో ఎన్టీఆర్ ఒక సినిమా చేయబోతున్నాడు . ఇందులో ధనుష్ కూడా మరో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా ఆరోజే రానుంది. ఇలా ఏకంగా నాలుగు సినిమాల అప్డేట్స్ ఎన్టీఆర్ పుట్టిన రోజున రాబోతున్నాయి. అభిమానులకు ఇది పండగే అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ కి సంబంధించిన అప్డేట్స్ లేక ఆయన అభిమానులంతా సోషల్ మీడియా ని విడిచి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు ఏకంగా నాలుగు సినిమాల అప్డేట్స్ రాబోతున్న ఈ నేపథ్యం లో మరోసారి ఎన్టీఆర్ అభిమానులంతా రాబోయే రోజుల్లో సోషల్ మీడియా లో దండయాత్ర చేయబోతున్నారు అని చెప్పొచ్చు. ఇక మే 20 న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఊసరవెల్లి చిత్రం కూడా విడుదల కాబోతుంది .