Homeక్రీడలుక్రికెట్‌SRH vs CSK: SRH అభిమాని చేతబడి.. రంగంలోకి దిగిన CSK.. బిసిసిఐ కి ఫిర్యాదు.....

SRH vs CSK: SRH అభిమాని చేతబడి.. రంగంలోకి దిగిన CSK.. బిసిసిఐ కి ఫిర్యాదు.. ఇదిగో క్లారిటీ

SRH vs CSK: శనివారం ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ప్రారంభంలో భీకరంగా పరుగులు చేసింది. ఆ తర్వాత వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈనేపథ్యంలో హైదరాబాద్ జట్టును క్లాసెన్ బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ తో ఆదుకున్నాడు. దీంతో హైదరాబాద్ 200 కు మించి పరుగులు చేయకపోయినా.. పర్వాలేదనుకునే టార్గెట్ చెన్నై ముందు ఉంచింది. హైదరాబాద్ విధించిన టార్గెట్ […]

SRH vs CSK: శనివారం ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ప్రారంభంలో భీకరంగా పరుగులు చేసింది. ఆ తర్వాత వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈనేపథ్యంలో హైదరాబాద్ జట్టును క్లాసెన్ బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ తో ఆదుకున్నాడు. దీంతో హైదరాబాద్ 200 కు మించి పరుగులు చేయకపోయినా.. పర్వాలేదనుకునే టార్గెట్ చెన్నై ముందు ఉంచింది.

హైదరాబాద్ విధించిన టార్గెట్ ఫినిష్ చేయడానికి రంగంలోకి దిగిన చెన్నై జట్టు ప్రారంభంలో ఇబ్బంది పడింది. మిడిల్ ఓవర్లలో సత్తా చూపించింది. ఒక దశలో గెలుపుకు దగ్గరగా వచ్చినప్పటికీ.. హైదరాబాద్ బౌలర్లు సత్తా చూపించడంతో చెన్నై జట్టు వెనక్కి తగ్గక తప్పలేదు. అయితే హైదరాబాద్ తన స్థాయి భారీ స్కోర్ చేయలేకపోవడం చెన్నై జట్టుకు వరంగా మారింది. హైదరాబాద్ విధించిన 195 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో 184 పరుగుల వద్ద ఆగిపోయింది. ఫలితంగా పది పరుగుల తేడాతో చెన్నై జట్టు ఓటమిపాలైంది.

చెన్నై జట్టు ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో శివం దుబే క్రీజ్ లో ఉన్నాడు. అతడికి సిక్సర్ ల దూబేగా పేరుంది. ఈ క్రమంలో అతడు కచ్చితంగా చెన్నై జట్టును గెలిపిస్తాడని అభిమానుల్లో బలమైన నమ్మకం ఉంది. ఈ దశలో అతడు దురదృష్టవశాత్తు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో మైదానం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. హైదరాబాద్ అభిమానుల ఆనందానికి అవధి లేకుండా పోయింది. అయితే శివం దుబే అవుట్ అవ్వడానికి ముందు హైదరాబాద్ అభిమాని ఒకరు మైదానంలో నిమ్మకాయ పట్టుకొని క్షుద్ర పూజలు చేయడం మొదలుపెట్టారు. వాస్తవానికి అతడు ఫన్నీగా ఈ పని చేశాడు. అతడు మంత్రం చదువుతుండగా ఒక్కసారిగా శివం దూబే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తాను చేసిన మంత్రం వల్లే అతడు అవుట్ అయ్యాడని ఆ అభిమాని జబ్బలు చరుచుకున్నాడు.

ఈ వీడియో నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. ఈ క్రమంలో ఈ సంఘటనపై చెన్నై జట్టు యాజమాన్యం బీసీసీఐకి ఫిర్యాదు చేస్తుందని పుకార్లు లేచాయి. దీంతోపాటు చెన్నై జట్టు అఫీషియల్ లెటర్ సోషల్ మీడియాలో సర్కులేట్ అవ్వడం మొదలుపెట్టింది. అయితే దీనిపై చెన్నై యాజమాన్యం స్పందించింది. అదంతా ఫేక్ అని కొట్టి పారేసింది. కాకపోతే ఇటీవల బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో చెన్నై యాజమాన్యం బిసిసిఐ కి ఫిర్యాదు చేసింది. అక్కడ డీజే ప్లే చేసిన పాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని.. బీసీసీఐకి చెన్నై యాజమాన్యం చేసిన ఫిర్యాదులో పేర్కొంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper