NTR Dragon: కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియాను శాసించే స్థాయికి ఎదిగిన దర్శకుడు ప్రశాంత్ నీల్…ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ మెకోవర్ కోసం ఎక్కువ రోజులపాటు గ్యాప్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ ఎట్టకేలకు ఎన్టీఆర్ లుక్ సెట్ అవ్వడంతో ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరపాలనే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే రీసెంట్ గా జరిగిన ఒక షెడ్యూల్లో ప్రశాంత్ నీల్ యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కిస్తున్నప్పుడు ఆ ఫైట్ సీక్వెన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ను పెట్టి యాక్షన్ బ్లాక్ చేస్తున్నప్పుడు అతని షోల్డర్ ఇంజురీ అయింది. ఆ షాట్ ని డూప్ తో కూడా తీయొచ్చు.
కానీ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో పెట్టి చేశాడని కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఆ షాట్ లో హీరో ఉంటే బాగుంటుందని ప్రశాంత్ నీల్ అనుకున్నాడు కానీ అది ఇంజురీ వరకు దారితీస్తుందని ఆయన అనుకోలేదు కదా అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికైతే 6 నుంచి 8 వారాలపాటు జూనియర్ ఎన్టీఆర్ రెస్ట్ అవసరమని డాక్టర్లు చెప్పడంతో దాదాపు రెండు నెలలపాటు ఈ సినిమా షూటింగ్స్ ను పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను చేయాల్సిన సందర్భంలో 2 నెలల పాటు సినిమాకి బ్రేకులు పడడం అనేది సినిమా యూనిట్ కి చాలా పెద్ద దెబ్బ అనే చెప్పాలి.
ఇక ఈ క్రమంలోనే పోస్ట్ ప్రొడక్షన్ మీద ఆయన ఎక్కువగా ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఈ సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం ఫినిష్ చేస్తే బాగుంటుంది. ఇక ఏది ఏమైనా కూడా అనుకున్న డేట్ కి సినిమాని రిలీజ్ చేయగలిగితే మాత్రం సినిమా మీద భారీ హైప్ ఉండడమే కాకుండా కలెక్షన్స్ కూడా బాగా వచ్చే అవకాశాలైతే ఉంటాయి. లేకపోతే మాత్రం సినిమా డీలా పడిపోయే ప్రమాదమైతే ఉంది…