Homeఎంటర్టైన్మెంట్Jetlee movie 2 days collections: 'జెట్ లీ' 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.....

Jetlee movie 2 days collections: ‘జెట్ లీ’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కమెడియన్ సత్య కి ఇంత గ్రాస్ ఊహించలేదు..

Jetlee movie 2 days collections: కమెడియన్ గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తన అద్భుతమైన కామెడీ తో ప్రేక్షకులను అలరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న సత్య, తొలిసారిగా హీరోగా మారి నటించిన ‘జెట్ లీ’ చిత్రం రీసెంట్ గానే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. సత్య , నితీష్ రానా కాంబినేషన్ లో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాల్లో కామెడీ ఏ రేంజ్ లో ఉన్నిందో ప్రత్యేకించి […]

Jetlee movie 2 days collections: కమెడియన్ గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తన అద్భుతమైన కామెడీ తో ప్రేక్షకులను అలరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న సత్య, తొలిసారిగా హీరోగా మారి నటించిన ‘జెట్ లీ’ చిత్రం రీసెంట్ గానే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. సత్య , నితీష్ రానా కాంబినేషన్ లో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాల్లో కామెడీ ఏ రేంజ్ లో ఉన్నిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ‘మత్తువదలరా 2’ లో సత్య లోని కామెడీ టైమింగ్ ని వేరే లెవెల్ లో ఉపయోగించుకున్నాడు నితీష్ రానా. కాబట్టి ‘జెట్ లీ’ పై యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేదు కానీ , డీసెంట్ కామెడీ తో ఆడియన్స్ ని అలరించడం లో మాత్రం ఈ సినిమా విఫలం అవ్వలేదు.

2 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టింది , బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇంకా ఎంత వసూళ్లను రాబట్టాలి అనేది వివరంగా ఈ విశ్లేషణలో చూద్దాం. నైజాం ప్రాంతం లో ఈ చిత్రం ఏషియన్, SVC మల్టీప్లెక్స్ థియేటర్స్ లో విడుదల అవ్వలేదు. ఇది సినిమాకు భారీ నష్టం , అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి నైజాం ప్రాంతం నుండి రెండు రోజుల్లో 1 కోటి 12 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఆంధ్ర + సీడెడ్ ప్రాంతాలకు కలిపి ఈ చిత్రానికి మొదటి రోజున 95 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి రెండు రోజుల్లో 2 కోట్ల 7 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 1 కోటి 5 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇతర ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , ఓవర్సీస్ నుండి 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 2 రోజుల్లో 3 కోట్ల 12 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, 1 కోటి 55 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల 50 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. లాంగ్ రన్ లో కాస్త డీసెంట్ హోల్డ్ ని కనబరిస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper