Homeఎంటర్టైన్మెంట్Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్: ప్రదీప్ ఇ. రాఘవ్ దర్శకత్వం: హెచ్. వినోద్ నిర్మాణం: కేవీఎన్ ప్రొడక్షన్స్ తమిళ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ, ఎన్నికలలో గెలిచి తమిళనాడు రాష్ట్రానికి సీయం కావడం అందరికీ తెలిసిందే. ఈరోజు విడుదలైన జన నాయకుడు(తమిళంలో జన […]

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు

సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్

ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్

ఎడిటర్: ప్రదీప్ ఇ. రాఘవ్

దర్శకత్వం: హెచ్. వినోద్

నిర్మాణం: కేవీఎన్ ప్రొడక్షన్స్

తమిళ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ, ఎన్నికలలో గెలిచి తమిళనాడు రాష్ట్రానికి సీయం కావడం అందరికీ తెలిసిందే. ఈరోజు విడుదలైన జన నాయకుడు(తమిళంలో జన నాయగన్) ఎన్నికల ముందుగా రావలిసి ఉన్నప్పటికీ కొన్ని అవాంతరాలు ఎదురుకావడంతో చాలా ఆలస్యంగా రిలీజ్ అయింది. విజయ్ చివరి సినిమాగా ప్రచారం జరగడంతో తమిళ వెర్షన్ పై అక్కడ ప్రేక్షకులకు ఆసక్తి ఉండొచ్చు కానీ ఇక్కడ తెలుగులో మాత్రం పెద్దగా ఆసక్తి లేదు. దీనికి కారణం ఈ సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ అని మొదటి నుంచి ప్రచారం జరగడమే. అసలే తెలుగు సినిమాకు రీమేక్.. దాన్ని మళ్ళీ తెలుగులోకి డబ్ చేసి వదలడం అనేది వింత. కానీ ఇలాంటి వింతలు తమిళ మేకర్స్ కు అలవాటే కాబట్టి తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆశ్చర్యపోరు. భగవంత్ కేసరి కమర్షియల్ గా విజయం సాధించడమే కాకుండా బాలయ్యకు మంచి పేరు తీసుకొచ్చిన చిత్రం. సబ్జెక్ట్ మంచిది కానీ రీమేక్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలని మాత్రం చాలామందికి ఆసక్తి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం. ఇంట్రడక్షన్ నాలుగు లైన్లు అయిపోయింది కాబట్టి ఇక డైరెక్ట్ గా రివ్యూలోకి వెళ్దాం.

రీమేక్ కాబట్టి తెలుగు సినిమా చూసిన వారికి కథ తెలిసే ఉంటుంది. వెట్రి కొండన్ (విజయ్) జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. అక్కడ జైలర్ శ్రీకాంత్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) కు విజయ్ గతం తెలిసి అభిమానంగా ఉంటాడు. జైలర్ కూతురు విజి (మమితా బైజు) వెట్రిని సూపర్ మ్యాన్ అని పిలుస్తూ ఉంటుంది. వెట్రి జైలు నుంచి విడుదలైన రోజే జైలర్ శ్రీకాంత్ ఒక బాంబుదాడిలో చనిపోవడంతో విజి బాధ్యతను తీసుకుంటాడు. సొంత కూతురికంటే ఎక్కువగా పెంచుతాడు. విజి ని ఆర్మీ ఆఫీసర్ గా చూడడం చనిపోయిన విజి తల్లిదండ్రుల కల. అందుకే ఎలాగైనా విజిని ఆర్మీలో చేర్పించాలని ప్రయత్నాలు చేస్తుంటాడు వెట్రి. ఇలా సాగుతున్న వీరి జీవితంలో అనుకోకుండా విలన్ అమ్రిష్ పూజారి(బాబీ డియోల్), రోజా రంగసామి(ప్రకాష్ రాజ్) లాంటి వ్యక్తులు ఇండియాలో విధ్వంసం సృష్టించడానికి చేస్తున్న కుట్రకు సంబంధించిన ఫైల్ విజి చేతికి వస్తుంది. అందులో ఏముందో విజికి తెలియదు. ఒక ఆఫీసర్ ఇచ్చిన ఫైల్ ను సీయం కు ఇస్తుంది. దీంతో విలన్లకు టార్గెట్ అవుతుంది. విజి పై హత్యా ప్రయత్నం చేయడంతో వెట్రి ఇక విలన్ ల అంతానికి పూనుకుంటాడు. తర్వాత ఈ పోరాటం ఏలాంటి పరిణామాలకు దారితీసింది? ఈ పోరాటంలో ప్రజలకు మంచి చేసి జన నాయకుడు ఎలా అయ్యాడనేది ఈ తమిళ కేసరి మిగతా కథ.

భగవంత్ కేసరి లో కోర్ ప్లాట్ అలాగే తీసుకుని దానికి ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ సెటప్ లు కమర్షియల్ ఎలిమెంట్లు, పొలిటికల్ మైలేజ్ వచ్చేలా సీన్లు జోడించి తీసిన చిత్రం ఈ జన నాయకుడు. ఇది ఏ స్థాయిలో ఉంటుందంటే శ్వాస్నియా ఒక ఆఫ్రికన్ దేశంలో ప్రభుత్వాన్నీ కూలగొట్టి ఆ దేశాన్ని జాన్ హిమ్లర్ తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. ఇదొక ఎపిసోడ్. అంటే విలన్ పాత్రకు ఇచ్చిన ప్యాన్ వరల్డ్ స్థాయి బిల్డప్ అన్నమాట. హిమ్లర్ అనగానే ఎవరో అనుకునేరు. ఇతనెవరో కాదు గతంలో అమ్రిష్ పూజారి(బాబీ డియోల్). ఇంటర్నేషనల్ గా జాన్ హిమ్లర్ పేరుతో చెలామణి అవుతుంటాడు. ఇక యాక్షన్ డోస్ మామూలుగా లేదు. అవసరం ఉన్నా లేకపోయినా సినిమా అంతా రక్తం ఏరులై పారుతుంది అంటే అది చాలా చిన్న మాట. రక్తం అమెజాన్ నదై, నైలు నదై పారుతుంది. అక్కడక్కడా కొన్ని సీన్లు తప్ప సినిమా అంతా అవుట్ డెటెడ్ బిల్డప్ షాట్లతో, ఆసక్తి రేకెత్తించని ఫక్తు కమర్షియల్ ఎలిమెంట్స్ తో అదోరకంగా ఉంటుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్, దళపతి కచేరీ పాట.. ఇలాంటి అక్కడక్కడా కొన్ని మెరుపులు తప్ప మిగతా అంతా మనం అస్సాం కి వచ్చామనే ఫీల్ కలుగుతుంది. సినిమా అస్సాం కి పోవడం కాదు మనల్ని మనకు తెలియకుండానే అస్సాం కు తరిమేశారని ఇందాక లైన్ సారాంశం.. సమ్మరీ. ఇక క్లైమాక్స్ అయితే ప్రేక్షకుల సహనానికి పరిక్ష. విజయ్ ఫాన్స్ తమిళంలో ఆహా ఓహో అంటూ ఎంజాయ్ చేయగలరేమో కానీ ఇక్కడ అది పూర్తిగా నాన్ సింక్. అసలు భగవంత్ కేసరిని ఇలా కూడా బలవంత కేసరిగా మార్చగలరా అని ఒక్కోసారి డౌట్ కూడా వస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే వెట్రి పాత్రలో విజయ్ తనదైన స్టైల్ లో చేసుకుంటూ పోయాడు. డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్ లు బాగున్నాయి కానీ అతి కమర్షియల్ ఎలిమెంట్స్ వల్ల అవి కూడా చప్పగా అనిపిస్తాయి. బాబీ డియోల్ పాత్రను పవర్ఫుల్ గా నే చూపించారు కానీ అవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన ఎలివేషన్లు కావడతో మనకు సోది అనిపిస్తూ ఉంటుంది. మమిత బైజు ఒకే. ఇక అసలు హీరోయిన్ పూజా హెగ్డే సంగతి మాట్లాడుకుంటే అసలు ఆ పాత్ర అవసరమే లేదు. పానకంలో పుడకలాగా అనిపిస్తూ ఉంటుంది. ప్రకాష్ రాజ్ యాక్టింగ్ మాత్రం ఎప్పటిలాగే బాగుంది.

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల యావరేజ్. దళపతి కచేరీ పాట తప్ప మిగతావి డల్ గా ఉన్నాయి. సత్యన్ సూరియన్ ఛాయాగ్రహణం డీసెంట్ గా ఉంది. వీఎఫ్ యక్స్ క్వాలిటీ చాలా చోట్ల తేలిపోయింది. ముఖ్యంగా బోట్లను, షిప్ ను బాంబులతో పేల్చే సీన్స్ లో అది క్లియర్ గా తెలుస్తుంది. ఒక్క మాట తప్పనిసరిగా చెప్పుకోవాలి. దర్శకుడు వినోద్ మాంఛి బిర్యానీ వండబోయి అందులో సాంబార్ పౌడర్,రసం పౌడర్, టాల్కమ్ పౌడర్ లాంటివి అన్నీ కలిపి తెలుగువాళ్ళు తినలేని కిచిడీ వండడంలో వంద శాతం విజయం సాధించాడు.

సినిమాలో ఏం బాగున్నాయో తెలుసా?

1. విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్, విజయ్ స్టైల్
2. ఇంటర్వెల్ ఎపిసోడ్, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్
3. దళపతి కచేరీ పాట

సినిమాలో బాగలేనివి ఇవి:

అక్కడక్కడా సాగదీసినట్టు అనిపించే సెకండాఫ్.

1. అతికీ అతకని కమర్షియల్ ఎలిమెంట్స్
2. అర్థం పర్థం లేని రక్తపాతం
3. చాలా చోట్ల మిస్సయిన లాజిక్స్

రేటింగ్: 1.75/5

ఫైనల్ వర్డ్: తెలుగు వాళ్ళు భరించలేని దళపతి కచేరీ

Ramu Kovuru
Ramu Kovuruhttps://oktelugu.com/
Ramu Kovuru is a writer having 10 plus years of experience. He has worked for websites writing movies content. He is also woriking in Telugu film industry as a writer for the past 5 years. He has good knowledge in cinema across the languages. He contributes to movie reviews.

Related News

Most Popular

Oktelugu Epaper