Homeఎంటర్టైన్మెంట్Aadarsa Kutumbam: డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తున్న 'ఆదర్శ కుటుంబం'..5 రోజుల్లో వచ్చిన గ్రాస్ ఎంతంటే!

Aadarsa Kutumbam: డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’..5 రోజుల్లో వచ్చిన గ్రాస్ ఎంతంటే!

Aadarsa Kutumbam: విక్టరీ వెంకటేష్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి వీకెండ్ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టినప్పటికీ , వర్కింగ్ డేస్ లో మాత్రం వసూళ్లు భారీగా డౌన్ అయ్యాయి. నాల్గవ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన […]

Aadarsa Kutumbam: విక్టరీ వెంకటేష్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి వీకెండ్ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టినప్పటికీ , వర్కింగ్ డేస్ లో మాత్రం వసూళ్లు భారీగా డౌన్ అయ్యాయి. నాల్గవ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , 5 వ రోజున కేవలం 1 కోటి 36 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఓవరాల్ గా మొదటి 5 రోజులకు కలిపి 22 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా, వరల్డ్ వైడ్ గా 32 కోట్ల 27 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 61 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 32 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.

ఓవరాల్ గా ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకేసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ నుండి 2 కోట్ల 41 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు నైజాం ప్రాంతం లో 17 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా, సీడెడ్ లో 7 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం ప్రాంతం లో దీపావళి వీకెండ్ వల్ల బ్రేక్ ఈవెన్ మార్కు కి చాలా దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ , సీడెడ్ ప్రాంతం లో మాత్రం బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం కష్టమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో ఈ చిత్రానికి విడుదలకు ముందు 20 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

5 రోజులకు కలిపి 9 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3 కోట్ల 48 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా , ఓవర్సీస్ నుండి 6 కోట్ల 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్ లో విడుదలకు ముందు ఈ చిత్రానికి 13 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అసాధ్యం కాబట్టి , కచ్చితంగా ఈ చిత్రం ఓవర్సీస్ లో డబుల్ డిజాస్టర్ గా నిలుస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కర్ణాటక +రెస్ట్ ఆఫ్ ఇండియా లో కూడా ఈ చిత్రం డబుల్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper