
Nagarjuna-Lakshmi’s Divorce : టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలికి ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెలిందే. నాగేశ్వర్ రావు తరువాత మూడో తరం వారసులు ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. సినిమాల్లో కొనసాగుతున్న సమయంలో అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీకి బంధుత్వం ఏర్పడింది. ఈ క్రమంలో అక్కినేని నాగార్జునకు రామానాయుడికి కూతురు లక్ష్మిని ఇచ్చి వివాహం చేశారు. అయితే కొంతకాలం తరువాత వీరిద్దరు విడిపోయారు. ఇద్దరూ వేర్వేరు వ్యక్తులతో వివాహం చేసుకున్నారు. ఇంతకాలం నాగార్జున -లక్ష్మిలు విడిపోవడానికి ఎన్నో కారణాలను చూపుతూ ప్రచారం చేశారు. కానీ లేటేస్టుగా అసలు విషయం బయటపడింది. వీరు విడిపోవడానికి అసలైన కారణం ఇదేనంటూ కొందరు చెబుతున్నారు.

అక్కినేని నాగార్జున సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే లక్ష్మిని 1984లో పెళ్లి చేసుకున్నారు. 1986లో వీరికి నాగచైతన్య జన్మించారు. ఆ తరువాత నాగార్జున ‘విక్రమ్’ సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన తరువాత నాగార్జున బిజీగా మారిపోయారు. దీంతో ఫ్యామిలీ లైఫ్ ను మిస్సయ్యేవారు. ఈ క్రమంలో నాగార్జున -లక్ష్మిల వద్ద మనస్పర్థలువ వచ్చాయి. అయినా వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగేవారు.
అయితే అసలు కారణం ఏంటంటే.. అక్కినేని ఫ్యామిలీకి అన్నపూర్ణ స్టూడియో ఉన్న విషయం తెలిసిందే. నాగేశ్వర్ రావు గారు కొత్త హీరోయిన్లను ప్రోత్సహించేవారు. ఇండస్ట్రీకి వచ్చిన ఏ హీరోయిన్ కు అయినా అన్నపూర్ణ స్టూడియోలో ఉన్న గెస్ట్ హౌస్ లో ఆశ్రయం ఇచ్చేవారు. దీంతో అన్నపూర్ణ స్టూడియోలో హీరోయిన్లకు వసతి దొరుకుతుందన్న ప్రచారం సాగింది. ఈ విషయంలో దగ్గుబాటి రామానాయుడు, లక్ష్మికి కాస్త అసౌకర్యాన్ని కలిగించిందట.
అంతేకాకుండా నాగార్జున గెస్ట్ హౌస్ లోని కొందరు హీరోయిన్లతో సన్నిహితంగా ఉండేవారని ప్రచారం చేశారు. ఇది ఆ నోటా.. ఈనోటా.. దగ్గుబాటి లక్ష్మికి కొందరు చెప్పడంతో నాగార్జునను నిలదీసినట్లు సమాచారం. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడాకుల వరకు వెళ్లిందట. అయితే ఇన్నాళ్లు అసలు విషయం చెప్పకుండా ఏవేవో కారణాలతో వీరిపై ట్రోలింగ్ చేశారు. అసలు కారణం ఇదేనంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. మరి ఇది కూడా నిజమేనా? అని కొందరు పోస్టులు పెడుతుంటే అక్కినేని ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు.