Vijay Deverakonda Rashmika age difference: ఈ నెల 26 న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) పెళ్లి రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో కుటుంబ సభ్యులు , మిత్రులు , శ్రేయోభిలాషుల సమక్షంలో గ్రాండ్ గా జరగనుంది. ఇన్ని రోజులుగా వీళ్ళ రిలేషన్ ని సీక్రెట్ గా మైంటైన్ చేస్తూ వచ్చారు . కానీ నిన్న మాత్రం ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వీళ్ళ పెళ్లి మ్యాటర్ ని బయటపెట్టారు. ఈ పెళ్ళికి అభిమానులు ప్రేమతో మా జంటకు పెట్టిన పేరు ‘ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ నే పెట్టామని ఈ జంట నిన్న చెప్పుకొచ్చింది. ఈ పెళ్ళికి సినీ సెలబ్రిటీలు పెద్దగా రాకపోవచ్చు కానీ , మార్చ్ 4న హైదరాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ లో జరగబోయే రిసెప్షన్ కి మాత్రం సినీ ప్రముఖులు , రాజకీయ నాయకులూ హాజరు అవుతారని తెలుస్తోంది.
ఇదంతా పక్కన పెడితే విజయ్ దేవరకొండ , రష్మిక మధ్య ఉన్నటువంటి వయస్సు తేడా ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవరకొండ వయస్సు 36 ఏళ్ళు కాగా , రష్మిక వయస్సు కేవలం 30 ఏళ్ళు మాత్రమే. అంటే ఇద్దరి మధ్య వయస్సు తేడా ఆరేళ్ళు అన్నమాట. ఇంత ఏజ్ గ్యాప్ తో సినీ సెలబ్రిటీలతో చాలా తక్కువ మంది మాత్రమే పెళ్లి చేసుకున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు ఈ జంట కూడా చేరబోతోంది. కానీ ఇంత వయస్సు తేడా ఉన్నప్పటికీ ఇండియా లోనే మోస్ట్ హాట్ కపుల్ గా ఈ జంటకు మంచి పేరుంది. వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో లీక్ అయితే చాలు , నిమిషాల వ్యవధిలో నేషనల్ లెవెల్ లో ట్రెండ్ అవుతుంది. వీళ్ళ పెళ్లి ఫోటోల కోసం కేవలం అభిమానులు మాత్రమే కాదు , సినీ అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇక వీళ్లిద్దరి కెరీర్ విషయానికి వస్తే రష్మిక వరుస హిట్స్ తో పీక్ ని ఎంజాయ్ చేస్తుంటే , విజయ్ దేవరకొండ మాత్రం వరుస ఫ్లాప్స్ తో మార్కెట్ ని పాడు చేసుకున్నాడు. ‘గీత గోవిందం ‘ తర్వాత స్టార్ గా మారిన రష్మిక , ఆ తర్వాత వరుస హిట్స్ ని అందుకుంటూ పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా మారింది. కానీ విజయ్ దేవరకొండ కెరీర్ లో ‘గీత గోవిందం’ తర్వాత హిట్ అనేదే లేకుండా పోయింది. కనీసం పెళ్లి తర్వాత అయినా అదృష్టం కలిసొచ్చి సక్సెస్ ట్రాక్ లోకి పడుతాడో లేదో చూడాలి.