spot_img
Homeఎంటర్టైన్మెంట్RRR: 'ఆర్ఆర్ఆర్'కు అంతర్జాతీయ స్థాయి అవార్డు.. వస్తోందా ?

RRR: ‘ఆర్ఆర్ఆర్’కు అంతర్జాతీయ స్థాయి అవార్డు.. వస్తోందా ?

RRR: తెలుగు సినిమా అనగానే నేడు ‘పాన్ ఇండియా’ అనే ముద్ర పడిపోయింది. నేడు పుష్ప సినిమాకి ఇతర భాషల్లో కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి అంటే.. దానికి కారణం తెలుగు సినిమా అనే బ్రాండ్ కూడా. అయితే, మన తెలుగు సినిమాల పై మనవాళ్ళకే ఎందుకో చిన్నచూపు ఉంటుంది. దానికి కారణం కూడా ఉంది లేండి. తెలుగులో ఎక్కువగా చెత్త సినిమాలే వస్తాయి అని అసంతృప్తి. కానీ, చేతకాని తనం ఉన్నచోటే కదా గొప్పతనానికి విలువ.

RRR
RRR

ప్రస్తుతం టాలీవుడ్ లో ఏడాదికి 220 సినిమాల వరకూ రిలీజ్ అవుతున్నాయి. వీటిల్లో 95 శాతం ప్లాప్ సినిమాలే. కావొచ్చు. కానీ, కొన్ని తెలుగు సినిమాలకు అంతర్జాతీయ స్థాయి ఉంది. ఆ మాటకొస్తే.. గతం నుండి ఇప్పటి వరకు చూసుకుంటే.. తెలుగు సినిమా  లు అంతర్జాతీయ స్థాయి సినిమా పురస్కారాలు అందుకుని తెలుగు తనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి.

మరి ఆ సినిమాలేంటో చూద్దామా. 1933 లో వేమురి గగ్గయ్య ప్రధాన పాత్రలో వచ్చిన ‘సావిత్రి’ అనే తెలుగు సినిమా వెనీస్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో గౌరవ డిప్లమోను దక్కించుకుంది. అలాగే ‘నర్తనశాల’ సినిమా ఇండోనేషియా రాజధాని జకార్తా లో జరిగిన ‘ఆఫ్రో ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌’లో బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్ అవార్డును సొంతం చేసుకుంది.

ఇక మన శంకరాభరణం చిత్రానికి ఫ్రాన్స్‌లో జరిగిన బేసన్‌కాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రైజ్ ఆఫ్ ది పబ్లిక్ పురస్కారం అందించారు. అలాగే రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఈగ సినిమాకు ఇంటర్ నేషనల్ స్థాయిలో బెస్ట్ ఫిల్మ్ టు వాచ్ అనే అవార్డు వచ్చింది.

Also Read: ANR: నా వల్ల ఎదిగింది, నాకే ఇవ్వరా ?, బాధను దిగమింగుకున్న ఏఎన్నార్ !

త్వరలో రాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా ఏదొక అంతర్జాతీయ స్థాయి అవార్డు వస్తోందని సినీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. మరి వస్తే.. మరోసారి తెలుగు సినిమా స్థాయి ఏమిటో చాటి చెప్పినట్టు అవుతుంది.

Also Read: Bala Krishna: బాలకృష్ణ – గోపిచంద్ సినిమాలో ముఖ్య పాత్ర చేయనున్న… వరలక్ష్మి శరత్ కుమార్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper