Nara Lokesh: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ గురించి అందరికీ తెలిసిందే. తండ్రి సీఎంగా ఉన్న టైంలో ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా పనిచేసినా రాజకీయాలపై లోకేశ్ ఇంకా పట్టు సాధించలేక పోయారు. రాజకీయ రణరంగంలో ప్రత్యర్థిని ఢీకొట్టాలంటే కావాల్సిన వ్యూహాలను ఆయన ఇంకా సిద్ధం చేసుకోలేదు. మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్.. తండ్రి అంత కాకపోయినా తన అనుభవంతో రాజకీయాలపై పట్టు సాధించి మొత్తానికి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఎంతో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబును 2019లో జరిగిన ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. గెలిస్తే గర్వం వస్తుందిలే.. అప్పుడు నేర్చుకోవడానికి ఏం ఉండదు. కనీసం ఓటమి నుంచైనా లోకేశ్ ఏమైనా నేర్చకున్నాడా? అంటే శూన్యం.. ఏమీ కనిపించడం లేదు.
వైఎస్‌ను ఢీకొట్టిన బాబు… మరి లోకేశ్ జగన్‌ను ఢీకొట్టగలడా?
వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబును వరుసగా రెండు సార్లు ఓడించాడు. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ ప్రమాదవశాత్తు మరణించిన విషయం తెలిసిందే. అయితే, వైఎస్ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు వైఎస్‌ను దీటుగా ఎదుర్కొన్నారు. ఇప్పుడు వైఎస్ తనయుడు జగన్ ప్రభుత్వంలో ప్రతిపక్షనేతగా బాబు కొనసాగుతున్నారు. జగన్ వయస్సులో బాబు కంటే చాలా చిన్నవాడు. ఆయన రాజకీయ అనుభవమే నలభై ఏండ్లు ఉంటుందని బాబు పలుమార్లు చెప్పుకొచ్చాడు. అలాంటిది టీడీపీ అధినేత నేటికి రాజకీయాల్లో విశ్రాంతి లేని నాయకుడిగా పోరాడుతూనే ఉన్నారు. వైఎస్ తనయుడు పాలిటిక్స్‌లో కంటే ఆయన జైలు జీవితమే ఎక్కువగా గడిపారు. ఆ తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ అయ్యి మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఎన్నో కేసులు ఉన్నాయి. కానీ నారాలోకేశ్ వివాదరహితుడు. ఒక్కసారి కూడా జైలుకు పోలేదు. క్లీన్ బ్యాక్ గ్రౌండ్ ఉంది.. తన తండ్రి చేసిన రాజకీయాలను సునిశితంగా పరిశీలిస్తే..అందులో కొంతైనా రాజకీయాన్ని గ్రహిస్తే మంచి నాయకుడు కాగలడు. కానీ లోకేశ్ ఆలోచన తీరు వేరు.. ఎప్పుడు చేం చేస్తాడో.. పార్టీకి ఎలాంటి మచ్చ తెస్తాడో అని చంద్రబాబే భయపడుతుంటాడు. తెలుగు తమ్ముళ్లు కూడా లోకేశ్ బాబు ఎప్పుడు ఏం కొంపముంచుతాడో అని భయపడుతుంటారని తెలుస్తోంది. ఇలాగే ఉంటే చంద్రబాబు తర్వాత పార్టీని ఎవరు లీడ్ చేస్తారనే భయం పచ్చ పార్టీలో పట్టుకుంది. బాబు లేకపోతే లోకేశ్ కింద పనిచేయడానికి ఎవరూ ముందుకు రారనేది అక్షర సత్యం. పార్టీ కుప్పకూలుతుంది.
పప్పు చేష్టలు మానవా..
టీడీపీని నమ్ముకున్న వారి కోసం, కొడుకును మంచి లీడర్‌గా చేసేందుకు చంద్రబాబు ఇప్పటికీ కష్టపడుతున్నారు. కానీ లోకేశ్ తండ్రి కష్టం తెలుసుకోకుండా ఆయన పరువుతో పాటు పార్టీ పరువు కూడా తీసెస్తున్నారు. ఆయనకు పాలిటిక్స్ చేతకావని చాలా మందే బాబుకు సూచించారట.. అయినప్పటికీ తన కొడుకు భవిష్యత్ ఏంటనీ బాబుకు భయం పట్టుకున్నట్టు తెలిసింది. బాబు మహా అయితే 2024 ఎన్నికల తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకునే అకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకు ఆరోగ్యం కూడా సహకరించడం లేదని సమాచారం. అప్పటివరకు అయినా నారా లోకేశ్ తండ్రి ద్వారా రాజకీయం నేర్చుకుంటారని అనుకుంటే అది ఈ జన్మలో సమాధానం లేని ప్రశ్నగానే మరోసారి ప్రూవ్ చేశాడు ‘పప్పు’ నాయుడు.. తాజా ఘటనతో లోకేశ్‌ను అందరూ పప్పు అని ఎందుకు పిలుస్తారో తేలతెల్లం అయిపోయింది.
Also Read: Jagan Sarkar: ఒక్క సర్క్యులర్‌తో థియేటర్ల ఓనర్లకు షాక్ ఇచ్చేసిన జగన్ సర్కార్..!
2024 ఎన్నికల్లో మరోసారి చంద్రబాబు జనసేన పార్టీతో పొత్తుపెట్టుకుంటారని టాక్ వినిపిస్తోంది. కానీ దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. బీజేపీ గట్టిగా తలుచుకుంటే లేదా ఏపీ సీఎం అభర్థిగా పవన్‌ను ప్రకటించి సామాజిక సమీకరణాలకు తెరలేపితే పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఖాయం.. అయితే, ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు గోవిందం అన్నట్టుగా ఇంకా పొత్తులు డిసైడ్ కాకముందే లోకేశ్ జనసేన ఆఫీస్‌కు వెళ్లి మరోసారి పిల్ల చేష్టలకు పాల్పడ్డాడు. ఈ విషయంపై అధికార పార్టీ నేతలు పప్పు నాయుడిని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. జనసేన, టీడీపీ ఒక్కటే అని ఇద్దరు కలిసి ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: MP Raghurama: ‘ఏ బిడ్డా.. ఇది నా అడ్డా’.. ఎట్టకేలకు ఆంధ్రాలో దిగిన జగన్ శత్రువు
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: When you will learn nara lokesh will change even after seeing your father
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com