Homeఎంటర్టైన్మెంట్Mokshagna Teja: మోక్షజ్ఞ వస్తున్నాడని ఎన్టీయార్ కి భయం పట్టుకుందా..? నందమూరి ఫ్యామిలీ రెండుగా చీలనుందా..?

Mokshagna Teja: మోక్షజ్ఞ వస్తున్నాడని ఎన్టీయార్ కి భయం పట్టుకుందా..? నందమూరి ఫ్యామిలీ రెండుగా చీలనుందా..?

సినిమా ఇండస్ట్రీలో సినిమాలా మధ్య పోటీ అనేది ఉంటుంది. ప్రతి హీరో కూడా తమ సినిమా సూపర్ సక్సెస్ అయి తను స్టార్ హీరోగా వెలుగొందలని కోరుకుంటాడు. ఎందుకంటే ఎవరైనా కూడా తామున్న ఫీల్డ్ లో వాళ్లే నెంబర్ వన్ స్థానంలో ఉండడానికి ఇష్టపడుతుంటారు. కాబట్టి హీరోలు కూడా అలానే ఎవరికి వారు నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకోవాలని చూస్తుంటారు...

Mokshagna Teja: నందమూరి ఫ్యామిలీ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పాతుకుపోయిన వృక్షం లాంటిది. శ్రీ ‘నందమూరి తారక రామారావు’ గారి వల్లే ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇంత వైభోగంగా కళకళలాడుతుందనే చెప్పాలి. ఒకప్పుడు ఆయన తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని మరి తెలుగు సినిమా స్థాయిని పెంచాలనే ఉద్దేశ్యంతో ఎంతోమంది దర్శక నిర్మాతలను ఎంకరేజ్ చేస్తూ సినిమాలు చేయడానికి శ్రీకారం చుట్టాడు. ఇక మంచి పాఠాలను చేస్తూ భారీ విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్లాడు. మరి ఇలాంటి క్రమంలో ఆయన తర్వాత జనరేషన్ లో నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ ఇండస్ట్రీ కి వచ్చి స్టార్ హీరోగా ఎదగడం ఆయన భారీ సక్సెస్ లను అందుకుంటు ముందుకు దూసుకెళ్ళడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. కానీ నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం వరుస సక్సెస్ లను అందుకుంటూ పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్నాడు…

ఇక ఇప్పుడు బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే జూనియర్ ఎన్టీఆర్ క్రెడిబిలిటీ పడిపోతుందా? నందమూరి అభిమానులు మొత్తం మోక్షజ్ఞ వైపే షిఫ్ట్ అవ్వబోతున్నారా? టిడిపి కార్యకర్తలు మోక్షజ్ఞని తమ భుజాల మీద మోయడానికి రెడీగా ఉన్నారా? అనే ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. మరి దానికి సంబంధించిన సమాధానం ఇంకా దొరకనప్పటికీ మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే మాత్రం జూనియర్ ఎన్టీయార్ కెరియర్ మీద భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉన్నాయి…

నిజానికి జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఆయనకి ఇప్పటివరకు ఒక ఇండస్ట్రీ హిట్టు కూడా లేదు. ఇక ఆయన సినిమాలు రిలీజ్ అయితే మొదటి రోజు సినిమా థియేటర్ కి వెళ్ళేది నందమూరి అభిమానులు, అలాగే టిడిపి కార్యకర్తలు… ఇక వీళ్ళిద్దరికీ చాలా రోజుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ చాలా దూరంగా ఉంటూ వస్తున్నాడు. బాలకృష్ణ ఎన్టీయార్ ఇద్దరు మధ్య చిన్న విభేదాలు రావడంతో నందమూరి అభిమానులు అందరూ బాలకృష్ణ వైపు ఉన్నారు. అలాగే టిడిపి కార్యకర్తలు చంద్రబాబు బాలకృష్ణ వైపే సపోర్ట్ చేస్తున్నారు. ఇక చంద్రబాబు నటుడు జైల్లో ఉన్నప్పుడు కనీసం పరామర్శించకుండా తన మొండి వైఖరిని చాటుకున్న జూనియర్ ఎన్టీఆర్ పైన చాలా మంది కోపంతో ఉన్నారు.

ఇక ఇలాంటి సమయంలో మోక్షజ్ఞ కనుక రంగంలోకి దిగితే జూనియర్ ఎన్టీఆర్ ఫాలోయింగ్ తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయంటూ పలువురు సినీ విమర్శకులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. చూడాలి మరి మోక్షజ్ఞ హీరోగా సక్సెస్ అయితే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కి చెక్ పెట్టడం పక్క అన్నట్టుగా తెలుస్తుంది… ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర ‘ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాని వచ్చే నెల 27వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper